ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల - supplementary

పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24, 425 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు.

results

By

Published : Jul 13, 2019, 3:02 PM IST

విద్యా వ్వవస్థకు పెద్దపీట వేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. బడ్జెట్​లో నిధుల కేటాయించే దీనికి నిదర్శనమని చెప్పారు. విజయవాడ గేట్ వే హోటల్‌లో పదో తరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 36,923 మంది విద్యార్థులు హాజరు కాగా... 24, 425 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. పరీక్షల నిర్వహణ అత్యంత పారదర్శకంగా జరిగిందని తెలిపారు. రెండు వారాల వ్యవధిలోనే మూల్యాంకణం పూర్తి చేసి ఫలితాలు విడుదల చేసిన అధికారులను మంత్రి అభినందించారు.

పదోతరగతి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details