ప్రభుత్వ ఐటీ సలహాదారులుగా ముగ్గురు నియామకం - శ్రీనాథ్ దేవిరెడ్డి
రాష్ట్ర ప్రభుత్వానికి ఐటీ సలహాదారులుగా ముగ్గురు నిపుణుల్ని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ap_govt_appointed_it_advisiros
జె.విద్యా సాగర్ రెడ్డి, శ్రీనాథ్ దేవిరెడ్డిలను ఐటీ సాంకేతిక సలహాదారులుగానూ, కె.రాజశేఖర్ రెడ్డిని ఐటీ పెట్టుబడులు, పాలసీ సలహాదారులుగా నియమిస్తూ ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి అనూప్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో కొత్త ఐటీ విధానం రూపకల్పన, ఐటీ రంగంలో పెట్టుబడులు, ప్రభుత్వానికి ఐటీ రంగంలో సాంకేతిక సలహాలను ఇచ్చేందుకు వీరిని సలహాదారులుగా నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
Last Updated : Jul 2, 2019, 12:54 PM IST