ఈనెల 23న మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 వరకు వ్యవసాయ, వైద్య విభాగ పరీక్ష జరగనుంది. మొత్తం 2,82,633 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా... ఇంజినీరింగ్ విభాగంలో 1,95,723 మంది... వ్యవసాయం, వైద్య విభాగంలో 86,910 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రంలో 109, హైదరాబాద్‌లో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు ఎంసెట్ ఛైర్మన్ రామలింగరాజు తెలిపారు.
నేటి నుంచి 24 వరకు ఎంసెట్ పరీక్షలు - medicine
ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి పకడ్బందీ చర్యలు తీసుకున్నట్లు ఏపీ ఎంసెట్ కన్వీనర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోని హైదరాబాద్‌లో పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్‌లో కేటాయించిన సమయం కంటే గంట ముందుగా పరీక్ష కేంద్రానికి హాజరుకావాలని చెప్పారు.
రేపటి నుంచి 24 వరకు ఎంసెట్ పరీక్షలు
గంట ముందే రావాలి...
విద్యార్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రానికి రావాలన్న రామలింగరాజు... నిమిషం ఆలస్యమైనా అనుమతించమని స్పష్టం చేశారు. బయోమెట్రిక్ హాజరు దృష్ట్యా విద్యార్థులు గోరింటాకు, మెహందీలాంటివి పెట్టుకోకూడదని సూచించారు. విద్యార్థులకు ఏమైనా సందేహాలుంటే... నివృత్తికి 0884-234535, 2356255 ఫోన్ చేయాలని ఎంసెట్ ఛైర్మన్ రామలింగరాజు సూచించారు.
Last Updated : Apr 20, 2019, 7:12 AM IST