గ్రామవాలంటీర్ల నియామకంపై సీఎస్ సమీక్ష - నియామకం
గ్రామ వాలంటీర్ల నియామకం ప్రక్రియ శరవేగంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే అధికారులతో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు.
గ్రామవాలంటీర్ల నియామకంపై సీఎస్ సమీక్ష
అమరావతిలో అధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమీక్ష నిర్వహించారు. గ్రామ వాలంటీర్ల నియామకంపై ఆరా తీశారు. నియామక ప్రక్రియ అంశాలపై అధికారులతో సమీక్షించారు. వాలంటీర్ల నియామకం, విధివిధానాల ప్రక్రియ వేగవంతం చేయాలని ఆదేశించారు. తదుపరి నోటిఫికేషన్ జారీకి కసరత్తు పూర్తి చేయాలని సీఎస్ సూచించారు.