నష్టపోయిన రైతులకు తక్షణ సాయం: చంద్రబాబు - cm
ఫొని తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో సుమారు రూ. 9.79 కోట్ల నష్టం జరిగిందని సీఎం చంద్రబాబు తెలిపారు.
సీఎం చంద్రబాబు
ఫొని తుపాను ప్రభావం వల్ల శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జరిగిన నష్టం అంచనా వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు ట్విట్టర్లో తెలిపారు. మొత్తం రూ. 9.79 కోట్ల నష్టం జరిగిందని, 783 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం వాటిల్లిందని తెలిపారు. తుపాను వల్ల నష్టపోయిన 6వేల 35 మంది రైతులకు తక్షణ సాయం కింద రూ.3.07 కోట్లు సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు.