శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి 2019-20 బడ్జెట్ ప్రవేశపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వానికి ఇది తొలి బడ్జెట్. నవరత్నాలే ముఖ్య ఉద్దేశంతో బడ్జెట్ రూపుదిద్దుకుందని ఆర్థిక మంత్రి వెల్లడించారు. 2019- 20 బడ్జెట్ అంచనా రూ.2,27,974.99 కోట్లు. రెవెన్యూ వ్యయం రూ.1,80,475.94 కోట్లు. మూలధన వ్యయం రూ.32,293.39 కోట్లు. వడ్డీ చెల్లింపుల నిమిత్తం రూ.8,994 కోట్లు. 2018-19 బడ్జెట్‌తో పోలిస్తే 19.32 శాతం పెంచారు. రెవెన్యూ లోటు రూ.1778.52 కోట్లు ఉండగా... ద్రవ్య లోటు సుమారు రూ.35,260.58 కోట్లు ఉంది. జీఎస్‌డీపీలో ద్రవ్య లోటు సుమారు 3.3 శాతం... జీఎస్‌డీపీలో రెవెన్యూ లోటు సుమారు 0.17 శాతం ఉంది.
తొలి పద్దు... సుమారు రూ.2 లక్షల కోట్లు! - jagan
సుమారు రెండు లక్షల 27 వేల కోట్లతో 2019-20 ఏపీ బడ్జెట్ రూపుదిద్దుకుంది. గతేడాదితో పోలిస్తే 19.32 శాతం రాష్ట్ర పద్దు పెరిగింది.
బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి