ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పైలట్​ను కాపాడండి! - 21 పార్టీల నేతలు

పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాలపై దిల్లీలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో చర్చించారు. జాతీయ భద్రతలో సంకుచిత రాజకీయాలకు తావులేదని విపక్ష నేతలు స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు

By

Published : Feb 27, 2019, 7:20 PM IST

ముఖ్యమంత్రి చంద్రబాబు
సరిహద్దులో ఉద్రిక్తతలపై దిల్లీలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం ముగిసింది. పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిణామాలపై సమావేశంలో చర్చించారు. ఈ విషయాలపై విపక్ష నేతలు సంయుక్త ప్రకటన విడుదల చేశారు. సైనికుల త్యాగాన్ని రాజకీయం కోసం వాడుకోవద్దని కేంద్రానికి సూచించారు. ఉగ్రవాద నిర్మూలనలో సైన్యం చేసే చర్యలకు సంఘీభావం తెలిపారు. భారత వాయుసేన ధైర్య సాహసాలను కొనియాడారు. జాతీయ భద్రతలో సంకుచిత రాజకీయాలకు తావులేదని స్పష్టం చేశారు. సరిహద్దులో ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితులపై ముఖ్యమంత్రి చంద్రబాబుఆందోళన చెందారు. సైనిక పోస్టులపై దాడి, యుద్ధవిమానం కూల్చివేత వంటి పాక్‌ చర్యలను ఖండించారు. అదృశ్యమైన పైలట్​ను క్షేమంగా స్వదేశానికి రప్పించేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరారు.

ABOUT THE AUTHOR

...view details