ఏపీలో 47 మంది ఐఏఎస్‌లు బదిలీ - ఐఏఎస్
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. వివిధ హోదాల్లో పని చేస్తున్న 47 మందిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి బదిలీ చేసింది.
రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. వివిధ హోదాల్లో పని చేస్తున్న 47 మందిని రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి బదిలీ చేసింది. ఏపీఐఐసీ ఈడీగా ఎం.హరి నారాయణ....ఎస్సీ కార్పొరేషన్ ఎండీగా గంధం చంద్రుడు... గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా రంజిత్ బాషా బదిలీ అయ్యారు. చేనేత శాఖ డైరెక్టర్‌గా హిమాన్షు శుక్లా..సర్వ శిక్ష అభియాన్ ఎస్పీడీగా చినవీరభద్రుడు, స్త్రీ శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్‌గా కృతికా శుక్లాకు పోస్టింగ్ ఇచ్చారు. పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్... కార్మిక, ఉపాధి కల్పన ముఖ్య కార్యదర్శిగా బి.ఉదయలక్ష్మి... ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శిగా కాంతిలాల్ దండే బదిలీ అయ్యారు. జీఏడీ సర్వీసెస్ కార్యదర్శిగా శశిభూషన్ కుమార్...జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఆర్పీ సిసోడియా బదిలీ అయ్యారు. సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శిగా ముద్దాడ రవిచంద్ర బదిలీ అయ్యారు. ఖనిజాభివృద్ది సంస్థ ఎండీగా భానుప్రకాశ్...కార్మిక శాఖ కమిషనర్‌గా డి.వరప్రసాద్..ఆరోగ్యశ్రీ సీఈవోగా ఎ.మల్లికార్జున.. ఏపీ ట్రాన్స్‌కో జేఎండీగా చక్రధర బాబు బదిలీ అయ్యారు.
అధికారి పేరు | బదిలీ స్థానం |
---|---|
బురడితి రాజశేఖర్ | ముఖ్య కార్యదర్శి పాఠశాల విద్య |
బి.ఉదయ లక్ష్మి | ముఖ్య కార్యదర్శి, కార్మిక, ఉపాధి కల్పన, శిక్షణ శాఖ |
ఆర్పి సిసోడియా | సాధారణ పరిపాలన శాఖలో జీపీఎం అండ్ ఏఆర్ విభాగం ముఖ్య కార్యదర్శి |
ముద్దాడ రవిచంద్ర | కార్యదర్శి, సాంఘిక సంక్షేమ శాఖ |
ముఖేష్ కుమార్ మీనా | కార్యదర్శి, గిరిజన సంక్షేమ శాఖ |
జి.సృజన | కమిషనర్, విశాఖపట్నం మహా నగరపాలక సంస్థ |
రంజిత్ బాషా | డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ |
కృతిక శుక్లా | డైరెక్టర్, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ |
కె.కన్నబాబు | విపత్తు నిర్వహణ శాఖ ప్రత్యేక కమిషనర్ |
కాంతిలాల్‌దండే | ఇంటర్ బోర్డు కార్యదర్శి |
కార్తికేయమిశ్రా | ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సంచాలకులు |
విజయరామరాజు | ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీ |
చక్రధరబాబు | ఏపీ ట్రాన్స్‌కో జేఎండీ |
హిమాన్షు శుక్లా | ఆప్కో ఎండీ |
పి.రాజాబాబు | సెర్ప్ సీఈవో |
ఎం.ప్రతాప్ | ఏపీ గిడ్డంగుల సంస్థ వీసీ, ఎండీ |