ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Woman Suicide Attempt: కక్షగట్టి పేదకుటుంబం ఇల్లు కూల్చివేత.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం - అద్దంకి మండలం లేటెస్ట్ న్యూస్

Woman Suicide Attempt: రైతుభరోసా కేంద్రానికి దారి కోసమంటూ బాపట్ల జిల్లాలో పేద కుటుంబం నివసిస్తున్న రేకుల ఇంటిని అధికారులు కూల్చేశారు. గడ్డివామిని చెల్లాచెదురు చేశారు. కుటుంబ సభ్యులను స్టేషన్‌కు పిలిపించి రోజంతా పడిగాపులు పడేట్టు చేశారు. అధికారులు, పోలీసుల చర్యలతో మనస్తాపం చెందిన పేద కుటుంబానికి చెందిన మహిళ.. పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 5, 2023, 8:35 AM IST

Woman Suicide Attempt: బాపట్ల జిల్లా అద్దంకి మండలం చక్రాయపాలేనికి చెందిన తిరుపతి శ్రీనివాసరావు ఇంటి పక్కనే రైతుభరోసా కేంద్రం నిర్మించారు. ఆర్​.బీ.కేకి వెళ్లే దారి విషయంలో వైఎస్సార్​సీపీకు చెందిన సర్పంచి, ఉపసర్పంచితో.. శ్రీనివాసరావు కుటుంబానికి వివాదం ఏర్పడింది. శ్రీనివాసరావుకు చెందిన రేకుల ఇల్లు, ప్రహరీ, గడ్డివామి తొలగించి.. ఆ ప్రదేశంలో రైతుభరోసా కేంద్రానికి రోడ్డు వేయాలని సర్పంచి, ఉపసర్పంచి పట్టుబట్టారు. ఆ మేరకు శ్రీనివాసరావు కుటుంబం నివాసం ఉంటున్న రేకుల ఇంటిని ప్రొక్లెయిన్‌తో రెవెన్యూ అధికారులు కూల్చేశారు. గడ్డివాముని చెల్లాచెదురు చేశారు.

YCP Leaders Demolished Walls: ఇంటి గోడలు కూల్చి.. ఖాళీ చేయాలంటూ బెదిరిస్తూ

గతంలో ఒకసారి గడ్డివాము తొలగించేందుకు రెవెన్యూ అధికారి ప్రయత్నించగా.. శ్రీనివాసరావు కుటుంబీకులు అడ్డుకున్నారు. దీంతో విధులకు ఆటంకం కలిగిస్తున్నారన్న ఫిర్యాదుతో.. శ్రీనివాసరావుతో పాటు ఆయన భార్య వెంకాయమ్మ, ఇద్దరు కుమార్తెలపై అద్దంకి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ కేసుతో పాటు మరో రెండు కేసులకు సంబంధించి నోటీసులు తీసుకోవాలంటూ శ్రీనివాసరావు కుటుంబానికి అధికార పార్టీ నాయకుల ద్వారా పోలీసులు కబురు చేశారు. మంగళవారం ఉదయం 11 గంటలకు పోలీస్‌స్టేషన్‌కు వచ్చినవారు.. సాయంత్రం 5 గంటలకు నోటీసులు తీసుకున్నారు.

Young man suicide: అయ్యో చినబాబూ..! చావనైనా చస్తా.. చేయని నేరం ఒప్పుకోనంటూ...

ఈ లోపు తమ రేకుల ఇల్లు, ప్రహరీని ప్రొక్లెయిన్‌తో కూల్చారని, వరి గడ్డిని రెవెన్యూ అధికారులు చెల్లాచెదురు చేశారని తెలుసుకున్న వెంకాయమ్మ.. తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. తాము ఇంటి వద్ద లేని సమయం చూసి ఆస్తుల్ని నాశనం చేస్తారా అంటూ పోలీస్‌స్టేషన్‌ ప్రాంగణంలోనే పురుగులమందు తాగేశారు. పోలీసులు ఆమెను అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం ఒంగోలు రిమ్స్‌కు తీసుకెళ్లారు. రెవెన్యూ, పోలీసు అధికారుల చర్యలతో తమ కుటుంబం ఇబ్బంది పడుతోందని.. శ్రీనివాసరావు కుటుంబీకులు వాపోయారు.

YSRCP Leader Followers Attack: నెంబర్​ లేని కార్లతో మంత్రి జోగి రమేష్ అనుచరుల హల్​చల్.. భక్తులపై దాడి

కాగా ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. బాధల్లో ఉన్న బడుగుల సమస్యలపై స్పందించని ప్రభుత్వ వ్యవస్థలు ఎందుకని.. ఆయన నిలదీశారు. ప్రభుత్వ వ్యవస్థలను నిర్వీర్యం చేసిన జగన్.. రాష్ట్రానికి సీఎంగా ఎందుకనీ ప్రశ్నించారు. అద్దంకిలో వైసీపీ నేతల ప్రోద్బలంతో రెవెన్యూ అధికారులు తమ ఇల్లు కూల్చేశారంటూ పోలీస్ స్టేషన్ ముందే వెంకాయమ్మ అనే మహిళ ఆత్మహత్యాయత్నం చేయడంపై ఆవేదన వెలిబుచ్చారు.

"మా రేకుల ఇంటి పక్కనే రైతుభరోసా కేంద్రం నిర్మించారు. ఆర్​.బీ.కేకి వెళ్లే దారి విషయంలో వైసీపీకు చెందిన సర్పంచి, ఉపసర్పంచితో మా కుటుంబానికి వివాదం ఏర్పడింది. దీంతో మా రేకుల ఇల్లు, ప్రహరీ, గడ్డివామి తొలగించి.. ఆ ప్రదేశంలో రైతుభరోసా కేంద్రానికి రోడ్డు వేయాలని సర్పంచి, ఉపసర్పంచి పట్టుబట్టారు. అనుకున్నట్లుగానే మా రేకుల ఇంటిని ప్రొక్లెయిన్‌తో రెవెన్యూ అధికారులు కూల్చేశారు. గడ్డివాముని చెల్లాచెదురు చేశారు."- దుర్గాభవాని, వెంకాయమ్మ పెద్ద కుమార్తె

ABOUT THE AUTHOR

...view details