ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

న్యూయర్​ వేడుకల్లో పాల్గొంటున్నారా.. ఈ నియమాలు పాటించాల్సిందే! - new yewar selabrations in ap

Newer celebrations in Telangana: తెలంగాణ రాష్ట్రంలో నూతన సంవత్సర వేడుకల దృష్ట్యా పోలీసులు నింబంధనలు విధించారు. హైదరాబాద్​లో త్రీస్టార్​ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వాహకులకు, యాజమాన్యాలకు ట్రాఫిక్ క్లియరెన్స్​కు సెక్యూరిటి గార్డులను నియమించుకోవాలని వెల్లడించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చూడటం, వేడుకల్లో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదంటూ పలు అంక్షలు విధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Newer celebrations
నూతన సంవత్సర వేడుకలు

By

Published : Dec 29, 2022, 8:21 PM IST

Newer celebrations in Hyderabad: తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరం నూతన సంవత్సర వేడుకలకు సిద్దం అవుతోంది. ఈ సారి మరింత ఘనంగా కొత్త సంవంత్సరానికి స్వాగతం పలికేందుకు హైదరాబాద్ వాసులు వేచిచూస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ప్రత్యేంగా వేడుకలు నిర్వహించే నిర్వాహకులు, యాజమాన్యాలు ఏర్పాట్లు చేస్తున్నాయి. పోలీసులు మాత్రం ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా చూసేందుకు పలు నిబంధలను విధించారు. మూడు కమిషనరేట్ల పరిధిలో వేడుకలను రాత్రి ఒంటి గంట వరకూ నిర్వహించుకునేందుకు త్రీస్టార్​ అంతకంటే పెద్ద హోటళ్లు, పబ్బులు, క్లబ్బుల నిర్వహకులు, యాజమాన్యాలు 10 రోజల ముందుగానే పోలీసుల నుంచి అనుమతి తీసుకోవాలని తెలిపగా ఇప్పటికే ఆ ప్రక్రియ పూర్తయింది.

వేడుకలు ప్రాంగణంలో ఎంట్రీ, ఎక్జిట్​ పాయింట్లు, పార్కింగ్ ప్రదేశాల్లోనూ సీసీటీవీ కెమెరాలు అమర్చాలని తెలిపారు. ట్రాఫిక్ క్లియరెన్స్​కు సెక్యూరిటి గార్డులను నియమించుకోవాలని సూచించారు. అసభ్యకర నృత్యాలు, న్యూసెన్స్ లేకుండా చూడాలని.. వేడుకల ప్రాంగణంలో శబ్ద తీవ్రత 45 డెసిబెల్స్ మించకూడదని ఆదేశించారు. ఎంటువంటి మారణాయుధాలను వేడుకల ప్రాంతాల్లోకి అనుమతించకూడదని సూచించారు. ఇందుకు క్షుణ్ణంగా తనిఖీ చేయాలని తెలిపారు.

మైనర్లకు నో పర్మిషన్:​ నిర్ధిష్ట పరిమితికి మించి టికెట్లు, పాసులు జారీ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. అధికంగా వేడుక ప్రాంగణానికి వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉందని హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ హెచ్చరించారు. నిర్వహకులు ప్రత్యేక పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేయాలని.. సాధారణ ట్రాఫిక్​కు ఎలాంటి ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు. జంటలకు కోసం పబ్బులు, బార్లలో నిర్వహించే వేడుకలకు మైనర్లను అనుమతించకూడదన్నారు.

వేడుకల్లో మాదక ద్రవ్యాలు సరఫరా జరగకూండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత యాజమాన్యాలదేనని ఆదేశించారు. పట్టుబడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్సైజ్ శాఖ అనుమతించిన సమయం దాటిన తర్వాత మద్యం సరఫరా చేయకూడదని.. వేడుకల తర్వాత మద్యం సేవించిన వారు వాహనం నడపుకుండా చూసుకోవడం, వారిని ఇంటకి చేరేలా చూసే బాధ్యత యాజమాన్యాలదని ఆదేశించారు. బాణాసంచా కాల్చేందుకు అనుమతి లేదని.. ఇందుకోసం అగ్నిమాపక శాఖ అనుమతి తప్పనిసరని సీపీ తెలిపారు.

తాగి వాహనం నడిపితే రూ. 10వేలు జరిమాన: మరో వైపు స్టార్ హోటళ్లు, పబ్బులు, క్లబ్బులు, బార్ అండ్ రెస్టారెంట్లు ట్రాఫిక్ నిబంధలపై ఎంట్రి పాయంట్లు, లోపల డిస్‌ప్లే బోర్టులు ఏర్పాటు చేయాలని పోలీసులు ఆదేశించారు. మద్యం సేవించడం నేరమని.. తాగి వాహనం నడిపితే పోలీసులు తీసుకునే చర్యలు తెలిపే విధంగా బోర్డులు ఉండాలన్నారు. మద్యం సేవించి వాహనం నడిపితే రూ.10వేలు జరిమానా, 6నెలల జైలు శిక్షతో పాటు మూడు నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సు రద్దు అవుతుందని తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. మైనర్ల డ్రైవింగ్ చేయడం నిషేదం, శబ్ధకాలుష్యం, ర్యాష్ డ్రైవింగ్​పై అవగాహన కల్పించేలా ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details