DONKEY MILK : గాడిద పాలలో చాలా పోషకాలు ఉంటాయని తెలుసు. వాటిని తాగడం వల్ల చాలా వరకు అనారోగ్య సమస్యలు బాగు అవుతాయని నమ్ముతారు. అయితే గాడిద పాలు దొరకడం చాలా అరుదు. కాకపోతే ఇక్కడ గాడిదపాలు పిండి ఇస్తాం అంటూ గాడిదలతో తిప్పుతూ.. కంటి ముందే పాలు పిండి అమ్ముతున్నారు. ఈ సంఘటన చూసి బాపట్ల జిల్లా అద్దంకి వాసులు ఆశ్చర్యపోతున్నారు. 5 మిల్లీ లీటర్ల పాలు వంద రూపాయలకు అమ్ముతున్నారు.
గాడిద పాలు 5 మిల్లీలీటర్లు @ 100 రూపాయలు.. ఎగబడుతున్న జనం
DONKEY MILK IN ADDANKI : చాలా మంది పొట్టకూటి కోసం తాము ఉంటున్న ప్రాంతాల నుంచి మరో చోటుకు వెళ్లి జీవనం సాగిస్తుంటారు. అక్కడే ఉంటూ కూలి పనులు చేసుకుంటూ పొట్టలు నింపుకుంటారు. అయితే అందరిలాగే పని చేసుకుంటే కిక్ ఏముంది అనుకున్నారో ఏమో కానీ.. వాళ్లతో పాటు తమ గాడిదలను తీసుకుని వెళ్లి వాటి పాలతో లాభం పొందుతున్నారు. ఎలాగో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
DONKEY MILK
లీటరు గాడిద పాల ధర సుమారు 10 వేల రూపాయలు పలుకుతుంది. తెలంగాణలోని మంచిర్యాల నుంచి వచ్చిన 15 వలస కుటుంబాలు గాడిద పాలు అమ్ముతున్నారు. గాడిద పాలు తాగటం వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని, శరీరానికి మంచిదని చెప్పి మరీ అమ్ముతున్నారు. దీంతో చాలా మంది ఆరోగ్యం కోసం కొనుక్కుంటే, మరికొంత సరదాగా కొనుక్కొని తాగుతున్నారు.
ఇవీ చదవండి: