Irrigated or Dry Paddy Crops in Murukondapadu:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. లక్షలకు లక్షలు అప్పులు తెచ్చి వరి నాట్లు వేస్తే.. వర్షం లేక, సాగునీరు అందక పంటలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతులు కన్నీరుమున్నీరవుతూ.. ఏం చేయలో దిక్కుతోచక సతమతమవుతున్నారు. మరోవైపు పంట కోసం తెచ్చిన అప్పులు తీర్చలేక, కుటుంబ సభ్యులను పోషించుకోలేక ఆత్మహత్యలే శరణ్యం అంటున్నారు. తాజాగా బాపట్ల జిల్లా మురుకొండపాడుకు చెందిన కొంతమంది రైతులు.. మెడకు ఉరితాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
Murukondapadu Farmers Fire on YCP Govt: బాపట్ల జిల్లా మురుకొండపాడులో సాగునీరు లేక వరి పంటలను ఎండిపోతున్నాయని రైతులు వాపోయారు. ప్రభుత్వం పంట పొలాలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేస్తూ.. పంట పొలాల్లోనే మెడకు ఉరి తాళ్లు వేసుకుని నిరసన తెలిపారు. కృష్ణా పశ్చిమ డెల్టా.. చివరి ఆయకట్టు ప్రాంతమైన బాపట్లలో సాగునీరు అందక.. వేల ఎకరాల్లో వరిపైరు ఎండిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సాగునీరు అందించి రైతులను కాపాడుకోలేని దైన్యస్థితిలో.. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సీఎం జగన్.. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకొచ్చి కృష్ణా డెల్టా ప్రాంతాలను పర్యటించాలని.. సాగునీటి సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోన్న రైతన్నల కష్టాలను తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
Chilli Farmers Problems: అందని సాగు నీళ్లు.. పంటకు తెగుళ్లు.. మిర్చి రైతు కన్నీళ్లు