ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పర్చూరు గిరిజన పాఠశాలలో లైంగిక వేధింపులు.. ఉన్నతాధికారి విచారణ - Drug use

Department of Tribal Welfare: బాపట్ల జిల్లా పర్చూరులోని గిరిజన పాఠశాలలో లైంగిక వేధింపులు, మత్తుపదార్థాల వినియోగం వంటి ఆరోపణలపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందచేస్తామని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ఉపకార్యదర్శి ఎం.రామ్మోహన రెడ్డి తెలిపారు. స్వం త భవనం నుండి అద్దెభవనం లోకి గతంలో పనిచేసిన అధికారులు అనుసరించిన విధానాలను ఉప కార్యదర్శి ఆరా తీశారు.. ఈసందర్భంగా పాఠశాల లో జరుగుతున్న వాటిని ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు రామ్మోహన రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు

Department of Tribal Welfare
Department of Tribal Welfare

By

Published : Feb 2, 2023, 3:13 PM IST

Department of Tribal Welfare: బాపట్ల జిల్లా పర్చూరులోని గిరిజన పాఠశాలలో లైంగిక వేధింపులు, మత్తుపదార్థాల వినియోగం వంటి ఆరోపణలపై ఉన్నతాధికారులకు సమగ్ర నివేదిక అందచేస్తామని రాష్ట గిరిజన సంక్షేమ శాఖ ఉపకార్యదర్శి ఎం.రామ్మోహన రెడ్డి తెలిపారు. పర్చూరులోని గిరిజన పాఠశాలపై వస్తున్న ఆరోపణలపై ఉన్నతాధికారుల అదేశాల మేరకు పాఠశాలలో విచారణ జరిపారు. ప్రిన్సిపాల్ ఖాదర్ వలీ, ఇతర సిబ్బంది నుండి లిఖితపూర్వకంగా వివరాలు తీసుకున్నారు.

విద్యార్థులు, ఒక మహిళ సిబ్బందిపై వ్యాయామ ఉపాధ్యాయుడు లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలపై వివరాలు ఆడిగి తెలుసుకున్నారు. ఉపాధ్యాయుల మధ్య విభేదాలు, లైంగికంగా వేధిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, అనధికారికంగా సిబ్బంది గైర్హాజరు.. వంటి అంశాలపై ఎలాంటి తీసుకున్నారో ఆడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతోనూ మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు.

పాఠశాలలో సిబ్బంది, విద్యార్థులు నుండి తీసుకున్న వివరాలు, సమగ్ర నివేదికను ఉన్నతాధికారులకు అందచేస్తామని రాంమోహనరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా పాఠశాలలో జరుగుతున్న విషయాలను ఎస్ఎఫ్ఐ ప్రతినిధులు రాంమోహన రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details