DETAH ANNIVERSARY CELEBRATIONS:పుట్టిన రోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి ఇలా పలు వేడుకల్ని అందరం జరుపుకుంటాం.. అందుకు సంబంధించిన పత్రికలను బంధువులకు పంచుతాము. కానీ.. బాపట్ల జిల్లా చీరాలలో ఓ వ్యక్తి మరణదిన వేడుకల ఆహ్వాన పత్రాలు పంచడం హట్‌టాపిక్‌గా మారింది. చీరాలలో పేరొందిన వైద్యుడు, మాజీ మంత్రి డాక్టర్ పాలేటి రామారావు ఈ వేడుకలను జరుపుకుంటున్నారు. ఉదయం 10 గంటలకు చీరాలలోని ఐఎమ్ఏ హాలులో జరిగే తన 12వ మరణదిన వేడుకలకు హాజరుకావాలని ఆహ్వాన పత్రికలు పంపిస్తున్నారు. తాను 75 ఏళ్లు జీవించాలని అనుకున్నానని.. ఇప్పటికే 63 పూర్తయ్యాయని అంటున్నారు. ఇంకా జీవించాల్సింది 12 ఏళ్లేనని చెబుతున్నారు. వచ్చే ఏడాది 11వ మరణ దినం జరుపుకుంటానని అంటున్నారు.
"నా మరణదిన వేడుకలకు ప్రతి ఒక్కరు రండి".. వైరల్ అవుతున్న మాజీ మంత్రి పాలేటి రామారావు ఆహ్వాన పత్రిక - paleti ramarao invitation viral
paleti ramarao invitation: ఏ మనిషైనా పుట్టడం, మరణించడం సహజం. మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కాబట్టి.. ఉన్నంతవరకు ఆనందంగా జీవించాలని చాలా మంది పుట్టినరోజు, ఇతర వేడుకలను వైభవంగా జరుపుకుంటారు. కొద్దిమంది ముందు జాగ్రత్తగా చనిపోక ముందే సమాధులు తయారు చేసుకుంటున్నారు. కానీ ఇక్కడ ఓ వ్యక్తి భిన్నంగా ఆలోచించి..తన మరణదిన వేడుకలను జరుపుకోవాలని నిర్ణయించుకున్నాడు. అందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను పంచడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఈ వింత ఘటన ఎక్కడ జరిగిందంటే??
DETAH ANNIVERSARY CELEBRATIONS
Last Updated : Dec 17, 2022, 10:34 AM IST