ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అయ్యా జగనన్న మా నియోజకవర్గ ఇంచార్జ్ మనసు మార్చండి: దళిత మహిళా జడ్పీటీసీ - అద్దంకి నియోజకవర్గ వైసీపీ విస్తృత స్థాయి సమావేశం

YSRCP leaders: అద్దంకి వైఎస్సార్​సీపీలో అసమ్మతి పెరుగుతోంది. మేదరమెట్లలో జరిగిన వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో పలువురు నేతలు తమ గోడు వెళ్లబోసుకున్నారు.

CONFLICTS BETWEEN YSRCP LEADERS
YSRCP నేతల మధ్య విభేదాలు

By

Published : Jan 25, 2023, 1:26 PM IST

Updated : Jan 25, 2023, 3:12 PM IST

YSRCP leaders: బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ విస్తృత స్థాయి సమావేశం కోరిశపాడు మండలం మేదరమెట్లలో జరిగింది. సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బీదా మస్తాన్ రావు, ఎంపీ మోపిదేవి వెంకటరమణ పరిశీలకులుగా హాజరయ్యారు. పరిశీలకులను ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు వద్ద అద్దంకి నియోజకవర్గ వైసీపీ పరిరక్షణ సమితి సభ్యులు కలసి వైసీపీ ఇంచార్జ్ అరాచకాలకు పాలపడుతున్నాడని, అక్రమ కేసులు బనాయించి ఇబ్బందులు పెడుతున్నాడని వివరించారు.

కోరిశపాడు జడ్పీటీసీ సభ్యురాలు మాట్లాడుతూ.. తాను దళిత మహిళననే కారణంతో తనను ఏ కార్యక్రమానికీ పిలవట్లేదని పరిశీలకుల ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. "అయ్యా జగనన్న మా నియోజకవర్గ ఇంచార్జ్ యొక్క మనసు మార్చండి.. మమ్మల్ని కలుపుకుపోవాలని చెప్పండి" అని కోరారు.

YSRCP నేతల మధ్య విభేదాలు

ఇవీ చదవండి

Last Updated : Jan 25, 2023, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details