ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Demolition of Poor Houses: సూర్యలంకలో పేదల గుడిసెలు కూల్చివేత.. దిక్కుతోచని స్థితిలో రోడ్లపై బాధితులు..

Demolition of Poor Houses: పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులకు అడ్డుగా ఉన్నాయని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ సమీపంలో గుడిసెలు తొలగించడంతో నిరుపేద ఎస్టీలు.. రోడ్డునపడ్డారు. పర్యాటక ప్రాజెక్టు కోసమంటూ.. ఎస్టీలు ఉంటున్న పూరిపాకలను.. స్థానిక వైఎస్సార్​సీపీ నాయకుడు చెంచయ్య తన అనుచరులతో నేలమట్టం చేశారు. దీంతో దాదాపు 20 కుటుంబాలు కట్టుబట్టలతో పిల్లపాపలతో రాత్రంతా రోడ్డుపైనే ఉన్నారు. వివరాల్లోకి వెళ్తే..

Etv Bharat
Etv Bharat

By

Published : Jul 12, 2023, 1:54 PM IST

సూర్యలంకలో పేదల గుడిసెలు కూల్చివేత

Demolition of Poor Houses: బాపట్ల జిల్లా సూర్యలంకలో నిరుపేద ఎస్టీలు నివాసం ఉంటున్న ఇళ్లన్నింటినీ రాత్రికి రాత్రే కూల్చేశారు. దీంతో వారంతా నిరాశ్రయులై చిన్నపిల్లలతో సహా రాత్రంతా రోడ్డుపైనే ఉన్నారు. పనిచేస్తే కానీ పూట గడవని ఆ నిరుపేద ఎస్టీ కుటుంబాలు.. ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవనం సాగిస్తున్నారు. అయితే పర్యాటక ప్రాజెక్టు కోసం అంటూ వారి గుడిసెలను స్థానిక వైఎస్సార్​సీపీ నేత చెంచయ్య తన అనుచరులతో కలిసి నిర్దాక్షిణ్యంగా మంగళవారం రాత్రి కూల్చివేశారు.

బాధితులు తెలిపిన సమాచారం ప్రకారం.. కూలి పనులు చేసుకుని జీవించే పలువురు ఎస్టీలు కొంత కాలంగా సముద్రం ఒడ్డున్న ఉన్న ప్రభుత్వ స్థలంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నారు. 9ఏళ్ల క్రితం బీచ్​ అభివృద్ధి కోసమని స్థానిక రాజకీయ నాయకులు వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించి మరో ప్రాంతానికి తరలించారు. అక్కడ గుడిసెలు వేసుకుని కూలి పనులు చేసుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం వైఎస్సార్​సీపీ నేతలు అక్కడి నుంచి వారిని ఖాళీ చేయించి మత్స్యశాఖ భూముల వద్దకు తరలించారు. ఇలా వారిని పంపించేస్తున్న ప్రతిసారి వేర్వేరు ప్రాంతాలకు వెళ్లి గుడిసెలు వేసుకుంటున్నారు. ఇలా సూర్యలంక పరిసరాల్లోనే వారు గత 20 ఏళ్లుగా జీవిస్తున్నారు. ఇప్పటివరకు మూడుసార్లు ఖాళీ చేయించారు.

YCP Leaders Land Scam: ప్రభుత్వ భూమిలో నివాసముంటున్న పేదల స్థలంపై వైఎస్సార్​సీపీ నేతల కన్ను

ప్రస్తుతం మత్స్యశాఖ భూముల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్న వారి స్థలంపై అధికారులు కళ్లు పడ్డాయి. పర్యాటక ప్రాజెక్టు కోసం ఆ స్థలం కేటాయించాం, ఖాళీ చేసి వెళ్లిపోవాలని వైఎస్సార్​సీపీ నేత చెంచయ్య వారం క్రితం వచ్చి ఆదేశాలు జారీ చేశారు. మరోచోట నివాసం కల్పించి.. గుడిసెలు తొలగించాలని బాధితులు ఆయన ఇంటికి పలుమార్లు వెళ్లి కోరినా పట్టించుకోకుండా తమ పూరిపాకలను.. తొలగించారని బాధితులు వాపోయారు. దీంతో దిక్కుతోచని స్థితిలో కట్టుబట్టలతో.. చింటిబిడ్డలతో సహా రోడ్డునపడ్డామంటూ బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు. ఇప్పుడు ఎక్కడికి వెళ్లాలో, ఏం చేయాలో తెలియటంలేదని కంటతడి పెడుతున్నారు. వర్షానికి పిల్లలతో కలిసి ఎక్కడ తల దాచుకోవాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Woman Suicide Attempt: కక్షగట్టి పేదకుటుంబం ఇల్లు కూల్చివేత.. మనస్తాపంతో మహిళ ఆత్మహత్యాయత్నం

"ఈ ప్రాంతంలో గుడిసెలు వేసుకుని జీవిస్తున్నాం. పర్యాటక ప్రాజెక్టు కేటాయించామని, ఖాళీ చేసి వెళ్లిపోవాలని వైఎస్సార్​సీపీ నేత చెంచయ్య వారం క్రితం ఆదేశాలు జారీ చేశారు. చెంచయ్య ఇంటి వద్దకు రెండుసార్లు మేము వెళ్లి.. ఆయనను కలిసి వేరే చోట స్థలాలు ఇస్తే ఇక్కడ ఖాళీ చేస్తామని చెప్పాము. అప్పటి వరకు గుడిసెలను తొలగించవద్దని కోరాము. మా విజ్ఞప్తిని పట్టించుకోకుండా పంచాయతీ గుమస్తా ఆంజనేయులను సాయంత్రం పంపించి అనుచరుల ద్వారా మా పూరి గుడిసెలు బలవంతంగా కూల్చివేసి మాకు గూడు లేకుండా చేశారు. రాత్రిపూట పిల్లలతో ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కుతోచలేని స్థితిలో రోడ్డుపైనే గడిపాము. ఇంతకుముందు 10 ఏళ్ల క్రితం కూడా మమ్మల్ని వేరే ప్రాంతానికి పంపించారు. ఇలా ఇప్పటివరకు మూడుసార్లు మమ్మల్ని గుడిసెలు మార్పించారు." - బాధితులు

Shops Demolished in Kuppam: వైసీపీ నాయకుడి అరాచకం.. టీడీపీ సానుభూతిపరుల దుకాణాలు కూల్చివేత

ABOUT THE AUTHOR

...view details