Celebration of Accused in Boy Burning Alive Case: అమర్నాథ్ హత్య కేసు నిందితుడి సంబరాలు.. వైరల్‌గా మారిన డ్యాన్స్ వీడియోలు Celebration of Accused in Boy Burning Alive Case:డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన వాళ్లు బెయిల్‌పై బయట తిరుగుతారు. ముఖ్యమంత్రితో కలిసి ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎందుకంటే ఆయన అధికార పార్టీ ఎమ్మెల్సీ. ఇప్పుడు ఇదే కోవలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. బాపట్ల జిల్లాలో పదో తరగతి విద్యార్థి అమర్నాథ్ గౌడ్‌ని(Amarnath murder case) అత్యంత పాశవికంగా పెట్రోల్ పోసి తగులబెట్టి చంపిన వైసీపీ కార్యకర్త ఇప్పుడు ప్రజల మధ్య తిరుగుతున్నాడు. ఈ ఏడాది జూన్ 16వ తేదిన ట్యూషన్‌కు వెళ్తున్న అమర్‌నాథ్‌పై వెంకటేశ్వరరెడ్డి తన స్నేహితులతో కలిసి దారికాసి మరీ దాడిచేసి క్రూరంగా హత్య చేశాడు. అదే రోజున నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు ప్రకటించారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టగా రిమాండ్ విధించింది. నిందితుడు వెంకటేశ్వరరెడ్డి ఇటీవల బెయిల్‌పై విడుదలై రోడ్లపై డ్యాన్సులు చేస్తుండటం కలవరం రేపుతోంది.
Amarnath murder case విద్యార్థి అమర్‌నాథ్ హత్య కేసు వివరణలో తడబడ్డ ఎస్పీ.. రెండోసారి ప్రెస్‌మీట్..
బాపట్ల జిల్లా చెరుకుపల్లి మండలం, ఉప్పలవారిపాలెంలో పదవ తరగతి విద్యార్థి ఉప్పాల అమర్‌నాథ్‌పై పెట్రోలు పోసి నిప్పంటించి సజీవదహనం చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలన కలిగించింది. తన అక్కను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించినందుకు వైసీపీ కార్యకర్తల వెంకటేశ్వరరెడ్డి ఈ ఘాతుకానికి తెగబడ్డాడు. ఈ ఘటనలో నిందితులను పోలీసులు అప్పడే పట్టుకుని కోర్టులో హాజరు పరిచారు. ఇటీవల బెయిల్‌పై వచ్చిన నిందితులల్లో ప్రథమ ముద్దాయి వినాయక నిమజ్జనం సందర్బంగా నిర్బయంగా నడిరోడ్డుపై చిందులు వేస్తున్న వీడియో మంగళవారం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ వీడియోపై నెట్టిజెన్లు ట్రోల్ చేస్తూ, ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు.
CBN help to Amarnath: అమర్నాథ్ కుటుంబాన్ని పరామర్శించిన చంద్రబాబు.. 10 లక్షలు ఆర్ధికసాయం
అమర్‌నాథ్ ట్యూషన్‌కు వెళుతుండగా వరికుప్పల వెనుకకు తీసుకువెళ్లి పాము వెంకటేశ్వరరెడ్డి అతని నలుగురు అనుచరులు బాలునిపై పెట్రోలు పోసి సజీవదహనం చేశారు. ఈ కేసులో వెంకటేశ్వరరెడ్డితో పాటు అతని నలుగురు అనుచరులు కటకటాలపాలయ్యారు. ఈ ఘటనపై అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు వెల్లువెతాయి. పోలీసులు నిందుతులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచగా రిమాండ్ విధించారు. జైలు నుంచి నిందితులు నెల క్రితమే విడుదలయ్యారని, అప్పటి నుంచి గ్రామంలోనే ఉంటున్నారని స్థానికులు అంటున్నారు. వినాయక చవితి సందర్భంగా ఏ1 పాము వెంకటేశ్వరరెడ్డి నివాసం ఉండే పామువారిదిబ్బ వద్ద వారి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఐదురోజులు పూజల నిర్వహించారు.
Political Leaders fire on YSRCP Govt: 'అధికార పార్టీ అండతోనే రాష్ట్రంలో దారుణ సంఘటనలు'
ఈ నెల 23న నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో వెంకటేశ్వరెడ్డి పాల్గొని చేతిలో నుంచే తార జువ్వలను కాలుస్తూ సినిమా పాటలకు చిందులు వేశాడు. అతడు నృత్యం చేస్తున్న వీడియో మంగళవారం బయటకు వచ్చి వైరల్‌గా మారింది. అక్కకోసం పోరాడిన బాలుడి ప్రాణం పోయింది చంపిన వ్యక్తికి ఆనందం దక్కింది.. విద్యార్థిని తగలబెట్టిన (YCP activist burnt a boy alive) వ్యక్తి బెయిల్‌పై వచ్చి ఇలా సంబరాలు చేసుకుంటున్నాడంటూ సామాజిక మాద్యమాల్లో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబువంటి నాయకుడిపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపించి బెయిల్‌కు ఆటంకాలు సృష్టిస్తున్న ప్రభుత్వం పదిహేనేళ్ల బాలుడి హత్య కేసులో నిందితుడు స్వేచ్ఛగా బయట తిరిగే అవకాశమిచ్చిందని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు ఉదారంగా వ్యవహరించటం వల్లే వెంకటేశ్వరరెడ్డి బెయిల్ వచ్చిందనే విమర్శలు వస్తున్నాయి. నిందితులకు నేడు కోర్టు వాయిదా ఉన్నట్లు సమాచారం.