ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అన్నమయ్య జిల్లాలో గోడ కూలి బాలుడు మృతి

Death of the boy: గోడ కూలి బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారంలో జరిగింది. మంగంపేట అగ్రహారం.. ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్​మెంట్ కార్పొరేషన్ (ఏపీఎండీసీ) బైరైటీస్ గనులకు 50 మీటర్ల దూరంలోనే ఉన్నందున గనులలో బ్లాస్టింగ్ వల్ల ఈ విషాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

By

Published : Nov 17, 2022, 11:19 AM IST

Updated : Nov 17, 2022, 12:03 PM IST

Death of the boy
Death of the boy

గ్రామాన్ని తరలించాలని కోరుతున్న స్థానికులు

Death of the boy: అన్నమయ్య జిల్లా, ఓబులవారిపల్లి మండలం మంగంపేట అగ్రహారంలో గోడ కూలి బాలుడు(3) మృతి చెందాడు. దీంతో గ్రామస్తులందరూ ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్​మెంట్ కార్పోరేషన్ (ఏపీఎండీసీ)ని ముట్టడించారు. మంగంపేట అగ్రహారం ఏపీఎండీసీ బైరైటీస్ గనులకు 50 మీటర్ల దూరంలోనే ఉందని, గనుల్లో బ్లాస్టింగ్​ వల్ల ఈ విషాదం జరిగిందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

ఏపీఎండీసీ విస్తరణలో భాగంగా ఈ గ్రామాన్ని కొండ పక్కకు మార్చారు. ఈ గ్రామం డేంజర్ జోన్ పరిధిలోకి రావడంతో అక్కడి నుంచీ వేరే ప్రాంతానికి తరలించాలంటూ దశాబ్ద కాలంగా పోరాటం చేస్తున్నామని స్థానికులు తెలిపారు. మంగంపేట ఏపీఎండీసీ గనులలో బ్లాస్టింగ్ వల్ల ఇళ్లు నెర్రెలిచ్చుతున్నాయని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నిన్న సాయంత్రం మూడు సంవత్సరాల బాలుడు గోడకూలి అక్కడికక్కడే మృతి చెందాడని ఆవేదన వ్యక్తం చేశారు. గనులలో బ్లాస్టింగ్ చేసినప్పుడల్లా దుమ్ము ధూళి రాళ్లతో సహా మా గ్రామంలో పడుతున్నాయని వాపోయారు. అధిక మొత్తంలో బ్లాస్టింగ్ చేయడం వలన ఇళ్లన్ని ఎప్పుడు కూలుతాయో..అని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి ఆదుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

Last Updated : Nov 17, 2022, 12:03 PM IST

ABOUT THE AUTHOR

...view details