ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జీన్స్ పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీల బాదుడు - రాయితీలకూ నోచక మూతపడుతున్న పరిస్థితి - రాయదుర్గంలో జీన్స్ పరిశ్రమ మూత

YSRCP Negligence on Jeans Industry: అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన జీన్స్ పరిశ్రమ జగన్‌ బాదుడుకు బలవుతోంది. జగన్ సీఎం అయ్యాక విద్యుత్ ఛార్జీలు వడ్డించారు. రాయితీలకు ఎగనామం పెట్టేశారు. వేల మందికి జీవనాధారమైన పరిశ్రమల్లో కొన్ని మూతపడుతున్నాయి. ఉపాధి గల్లంతైన వారు వలస బాట పడుతున్నారు.

YSRCP_Negligence_on_Jeans_Industry
YSRCP_Negligence_on_Jeans_Industry

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 30, 2023, 10:09 AM IST

Updated : Nov 30, 2023, 3:18 PM IST

YSRCP Negligence on Jeans Industry :ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో తీవ్ర దుర్భక్ష పరిస్థితులతో అందరూ వలసపోయినా, రాయదుర్గంలో మాత్రం వలసలు కనిపించవు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పరిస్థితులు తారుమారయ్యాయి. రాష్ట్రానికి పరిశ్రమలు తేవడమే కాదు. పారిశ్రామిక విప్లవం తెచ్చామని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) పదే పదే ఊదరగొడుతుంటారు. కానీ ఆయన చేతలు పరిశ్రమలకు శరాఘాతంగా మారుతున్నాయి. ఇటీవల శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలో సిల్క్ దారం రీలింగ్ పరిశ్రమలు మూతపడగా.. ఇప్పుడు అనంతపురం జిల్లా రాయదుర్గం జీన్స్ పరిశ్రమ కూడా ప్రభుత్వ ప్రోత్సాహం కరవై నష్టాల ఊబిలోకి జారుకుంటోంది.

జీన్స్ పరిశ్రమలపై విద్యుత్ ఛార్జీల బాదుడు - రాయితీలకూ నోచక మూతపడుతున్న పరిస్థితి

Jeans Industry Crisis in Rayadurgam :గతంలో ఈ ప్రాంతంలో వేల సంఖ్యలో చేనేత మగ్గాలు ఉండేవి. వీటికి ఆదరణ తగ్గాక ఉపాధి కోసం చాలామంది ముంబయి వలస వెళ్లారు. అక్కడ జీన్స్ ప్యాంట్లు కుట్టడం నేర్చుకొని తిరిగి స్వగ్రామాలకు వచ్చి కుటీర పరిశ్రమగా గార్మెంట్స్ తయారీని ప్రారంభించారు. ఇలా బీజం పడిన జీన్స్ పరిశ్రమ నాలుగేళ్ల క్రితం వరకు బాగానే నడిచింది. వైసీపీ అధికారంలోకి వచ్చాక గడ్డుకాలం మొదలైంది.

సిల్క్ వైభవం రివర్స్ గేర్ - పట్టుగూళ్ల మార్కెట్​లో రీలింగ్ యూనిట్లు మూసేస్తున్న యజమానులు

Increase in Electricity Charges Effect on Industries :రాయదుర్గంలో దాదాపు 14 వందల మంది జీన్స్ పరిశ్రమలు యజమానులు ఉన్నారు. మరో 600 మంది గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి కుట్ట మిషన్లు పెట్టుకొని పీస్ వర్క్ కింద ప్యాంట్లు కుట్టి పెద్ద పరిశ్రమలకు అందిస్తున్నారు. ఇలా ప్రత్యక్షంగా, పరోక్షంగా 50 వేల మంది ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారు. పన్నుల రూపంలోనూ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వస్తోంది. అలాంటి జీన్స్ పరిశ్రమకు జగనన్న విద్యుత్‌ ఛార్జీల బాదుడు, పిడుగుపాటైంది. పెరిగిన ఛార్జీలతో వ్యాపారం కష్టం అవుతోందని, పరిశ్రమలను యజమానులు మూసేస్తున్నారు.

Industries Closing in AP Under CM Jagan Ruling :గతంలో తెలుగుదేశం ప్రభుత్వం జీన్స్ పరిశ్రమ పెట్టుకునే వారికి రాయితీలు అందించింది. విద్యుత్ కనెక్షన్ మొదలు, నీటి సరఫరా వరకు మౌలిక సదుపాయాలు కల్పించింది. దీని వల్ల పీస్ వర్క్ చేసే కూలీలు తక్కువ ఉత్పత్తి సామర్థ్యంతో జీన్స్ ప్యాంట్ల తయారీ పరిశ్రమలు పెట్టుకున్నారు. వీరికి నిపుణులైన టైలర్లను, కూలీలను అందించేందుకు స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్‌ను నెలకొల్పింది. దాదాపు 2 వేల మందికి నైపుణ్య శిక్షణ కూడా ఇప్పించారు. సీఎం జగన్ ఏలుబడిలో నైపుణ్య శిక్షణ కేంద్రాన్ని మూసేశారు. టైలర్లు, ఇతర నిపుణులు దొరకడం కష్టంగా మారింది. పరిశ్రమలు మూతపడడంతో ఉపాధి కోసం బెంగుళూరు, హైదరాబాద్, బళ్లారిలకు వలస వెళ్లాల్సి వస్తోంది.

స్పిన్నింగ్‌ మిల్లులు మూతపడుతున్నా పట్టించుకోని ప్రభుత్వం - వేలాది మంది ఉపాధికి గండి

ఆత్మహత్యలే శరణ్యం : కరవు జిల్లాలో ఎంతో మందికి ఉపాధి కల్పిస్తున్న జీన్స్ పరిశ్రమ పూర్తిగా మూతపడితే.. ఆకలి చావులే శరణ్యమని పరిశ్రమల యజమానులు వాపోతున్నారు.

పాలకుల నిర్లక్ష్యం, సంక్షోభంలో కలంకారీ పరిశ్రమ

Last Updated : Nov 30, 2023, 3:18 PM IST

ABOUT THE AUTHOR

...view details