రైతుల పక్షపాతిగా దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో నిలిచారని మంత్రి శంకర్ నారాయణ, ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా అనంతపురంలోని వైకాపా కార్యాలయంలో పార్టీ శ్రేణులతో కలిసి రైతు దినోత్సవాన్ని జరిపారు. ముందుగా రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
వైఎస్ రాజశేఖర్ రెడ్డి రైతుల పక్షపాతి- మంత్రి శంకర్ నారాయణ - రైతు దినోత్సవంపై వార్తలు
అనంతపురంలోని వైకాపా కార్యాలయంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి నిర్వహించారు. రైతుల సంక్షేమం కోసం వైఎస్ఆర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని మంత్రి అన్నారు.
అనంతపురంలో వైఎస్ జయంతి
రాజశేఖర్ రెడ్డి కుమారుడు సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజల అభివృద్ధిని ఆకాంక్షించి రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని మంత్రి అన్నారు. రైతుల అభివృద్ధి కోసం ప్రతి చోటా రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారన్నారు. రైతుల అభివృద్థి కోసం వైకాపా పాటుపడుతోందని గతంలోనూ ఉచిత కరెంటు ఇచ్చిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికి దక్కుతుందని గుర్తు చేసుకున్నారు.
ఇదీ చదవండి: ఎల్‌జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో 12 మంది అరెస్టు