ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫోన్ చేజారిందని... ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు - తాడిపత్రిలో ట్రాక్టర్ కిందపడి మృతిచెందిన యువకుడు

అనంతపురం జిల్లా తాడిపత్రిలో విషాదం నెలకొంది. ఓ యువకుడు ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి ప్రాణాలు వదిలాడు. మనోజ్ అనే యువకుడు ఫోన్ మాట్లాడుతుండగా అది చేజారి కిందపడిపోవటంతో దాన్ని పట్టుకునే ప్రయత్నంలో ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ట్రాక్టర్ టైర్లు మనోజ్​పైకి ఎక్కటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

youngster dead by falling under tractor unexpectdly in tadipatri at ananthapur district
అనంతపురం జిల్లా తాడిపత్రిలో ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతి

By

Published : Aug 30, 2020, 12:00 PM IST

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కిందపడి యువకుడు మృతిచెందిన ఘటన అనంతపురం జిల్లా తాడిపత్రిలోని వెంకటరెడ్డిపల్లి గ్రామ సమీపంలో జరిగింది. వెలమకూరు గ్రామానికి చెందిన చంతా జయరామకృష్ణకి ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడైన మనోజ్ ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తి చేశాడు. వెంకటరెడ్డిపల్లిలో బంధువుల పొలంలో సేద్యం చేసేందుకు స్నేహితుడు రవికుమార్​రెడ్డితో కలిసి ట్రాక్టర్ వేసుకుని వచ్చాడు. పొలంలో సేద్యం చేస్తుండగా మనోజ్​కు ఫోన్ రావటంతో మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు చరవాణి కిందపడిపోయింది. దాన్ని పట్టుకునే క్రమంలో మనోజ్ ట్రాక్టర్ నుంచి జారి కిందపడ్డాడు. టైర్లు మనోజ్​పై ఎక్కడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఉన్న ఒక్కగానొక్క కుమారుడి మృతితో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details