అనంతపురం జిల్లా కంబదూరు మండలం వైసీ పల్లి గ్రామంలో యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. మనోహర్ అనే యువకుడికి 6 నెలల క్రితమే వివాహమైంది.
ఇంట్లో సమస్యల వల్ల భార్య పుట్టింటికి వెళ్లిందని.. ఒత్తిడికి గురై ఆత్మహత్య చేసుకున్నాడని కంబదూరు ఎస్ఐ గౌస్ పీరా తెలిపారు. మనోహర్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించామన్నాకు. కేసు నమోదు చేశారు.