తల్లిదండ్రులు మందలించారని యువకుడి ఆత్మహత్య - ananthapuram newsupdates
ఓ డిగ్రీ విద్యార్థి అదేపనిగా చరవాణి చూడటంతో తల్లి తల్లిదండ్రులు మందలించారు. మనస్థాపానికి గురైన ఆ యువకుడు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి.. మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతపురం జిల్లా ధర్మవరంలోని శారదానగర్‌కు చెందిన రాజేష్ అనే యువకుడు డిగ్రీ చదువుతున్నాడు. అదేపనిగా చరవాణి చూడటంతో తల్లిదండ్రులు మందలించారు. అర్ధరాత్రి వరకు ఫోన్‌నే చూస్తూ...ఇంట్లోనే ఉండటంతో ఏదైన ఉద్యోగం చూసుకోవాలని అన్నారు. మనస్థాపనికి గురైన రాజేష్ చెరువు కట్ట వద్దకు సైకిల్ పై వెళ్లి చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకొని... మృతదేహాన్ని వెలికి తీశారు. ఒక్కగానొక్క కుమారుడు ప్రయోజకుడు అవుతాడు అనుకుంటే చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవటంతో తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ధర్మవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.