Lover cheating: ప్రేమించడం.. అవసరం తీరాక ముఖం చాటేయడం ఈ మధ్యకాలంలో పరిపాటిగా మారిపొయింది. అప్పటివరకు నువ్వే సర్వస్వం అంటూ వెంటపడుతూ మాయ మాటలు చెప్పి.. అవసరం తీరిన తరువాత నాకేమీ సంబంధం లేదని వదిలించుకుంటారు. బాధితులు మాత్రం పోలీస్స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉంటారు. ఇలాంటి ఘటనే అనంతపురం జిల్లాలో జరిగింది. అయితే ప్రేమికురాలు ఓ అడుగు ముందుకేసి పోలీసులను ఆశ్రయించింది. కాసేపట్లో జరగాల్సిన పెళ్లి నిలిపివేసింది.
కాసేపట్లో మరొకరితో ప్రియుడి పెళ్లి, ప్రియురాలు ఏం చేసిందంటే - విరేప
Marriage stop by police ప్రేమించానని నమ్మించాడు. నవ్వు లేకపోతే బతకలేనంటూ కల్లబొల్లి మాటలు చెప్పాడు. తీరా మరో యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్దమయ్యాడు. అది గ్రహించిన ప్రేమికురాలు పోలీసులను ఆశ్రయించింది. దీంతో పెళ్లి ఆగిపోయింది. అయితే వధువు బంధువులు పోలీసు కేసు పెట్టడంతో ఆ యువకుడిని స్టేషన్కు తరలించారు.
గుత్తి మండలం ఇసురాళ్లపల్లి గ్రామానికి చెందిన రమేష్ అనే యువకుడు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలానికి చెందిన యువతి గత కొద్ది రోజులుగా ప్రేమించుకుంటున్నారు. అయితే రమేష్ పెద్దవడుగూరు మండలం విరేపల్లి గ్రామానికి చెందిన మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. విషయం తెలుసుకున్న ప్రియురాలు గుత్తికి వచ్చింది. తనను ప్రేమించిన ప్రియుడు మరో యువతితో వివాహం చేసుకుంటున్నాడంటూ.. గుత్తి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంటనే పెళ్లి మండపానికి బయల్దేరి.. కాసేపట్లో జరగనున్న పెళ్లిని నిలిపివేశారు. ఇంకేముంది పెళ్లి పీటలు ఎక్కాల్సిన వరుడు పోలీస్ స్టేషన్ మెట్లను ఎక్కాడు. ఈ వివాహం తనకు ఇష్టం లేదని.. తాను ప్రేమించిన యువతినే పెళ్లి చేసుకుంటానని పోలీసులు ఎదుట వాపోయాడు. దీంతో వధువు బంధువులు రమేష్తో పాటు అతనికి సహకరించిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
ఇవీ చదవండి: