అనంతపురం జిల్లా రామగిరి మండలం, నసనకోట వైకాపా పార్టీకి చెందిన వారు, వినాయక నిమజ్జనాన్ని ముగించుకుని తిరుగు ప్రయాణం వస్తుండగా, వెంకటాపురానికి చెందిన తెదేపా నాయకులు నిమజ్జనం కోసం వెళుతున్నారు. రెండు పార్టీ నాయకులు ఎదురు పడిన సమయంలో ఒకరికొకరు మాట మాట అనుకొని గొడవ పడ్డారు. గొడవలో వైకాపాకు చెందిన సూరి తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువురికి సర్దిచెప్పారు. తీవ్రంగా గాయపడిన సూరిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు వచ్చారు. ప్రస్తుతం సూరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గొడవలో దాదాపు 10 మంది స్వల్పంగా గాయపడినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వినాయక నిమజ్జనంలో తెదేపా, వైకాపా వర్గీయుల గొడవ - anantapur
రాప్తాడు నియోజకవర్గంలో వినాయక నిమజ్జనం సమయంలో తెదేపా, వైకాపా నేతల మధ్య ఘర్షణ జరిగింది.
గొడవ