ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ ​డీలర్​ను తొలగించండి'

రేషన్ డీలర్ సరిగా సరకులు ఇవ్వడం లేదంటూ అనంతపురం జిల్లాలోని కదిరిపల్లి గ్రామస్థులు ఆరోపించారు. ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మహిళలను కించపరుస్తూ.. అవినీతికి పాల్పడుతున్న డీలర్​ను తొలగించాలని డిమాండ్ చేశారు.

By

Published : Jun 19, 2020, 6:56 PM IST

Published : Jun 19, 2020, 6:56 PM IST

womens protest
womens protest

అనంతపురం జిల్లా మడకశిర మండలం కదిరిపల్లి గ్రామంలోని మహిళలు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. రేషన్ డీలర్ సరకులు ఇవ్వకుండా మహిళలను కించపరిచేలా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 42వ నెంబర్ చౌకధర డిపో డీలర్ నారాయణ సరకులు ఇవ్వడంలో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. రేషన్ డీలర్​ను విధులనుంచి తొలగించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎమ్మార్వోకు వినతిపత్రం అందించారు.

"మా గ్రామంలోని రేషన్ డీలర్ బియ్యం తక్కువగా ఇస్తున్నారు. కందిపప్పు అసలు ఇవ్వడం లేదు. ఆరో విడత పంపిణీకి సంబంధించి ఇప్పటి వరకు సరకులు పంపిణీ చేయలేదు. సరకులు అందించాలని అధికారులు చెప్పినా నిర్లక్ష్యం వహిస్తున్నారు. రేషన్ ఇవ్వాలని గ్రామంలోని మహిళలు అడిగితే సరకులు ఇచ్చేశాను.. ఇక ఎవరికీ ఇచ్చేది లేదు పొమ్మంటున్నారు. మహిళలు అని చూడకుండా ఇష్టంవచ్చినట్లు తిడుతున్నారు. ఇలాంటి డీలర్లను తొలగించాలి" -బాధిత మహిళ (కదిరిపల్లి గ్రామస్థురాలు)

ఇదీ చదవండి :ఫిర్యాదుపై పోలీసులు స్పందించడం లేదు: రఘురామకృష్ణరాజు

ABOUT THE AUTHOR

...view details