అనంతపురం జిల్లా కూడేరు మండలం అరవకురు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాద సమాచారం పోలీసులకు అందింది. వెంటనే వచ్చిన పోలీసులకు మహిళ మృతదేహం కనిపించింది. వివరాలపై ఆరా తీయగా... ఆమె అనంతపురానికి చెందిన సరోజ.. భర్త జగదీశ్వరెడ్డిగా గుర్తించారు. ఆయన స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలుసుకున్నారు.
జగదీశ్వరరెడ్డిని విచారించగా... తామిద్దరమూ ద్విచక్రవాహనంపై వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టిందని తెలిపారు. ఆమె అక్కడిక్కడే చనిపోయిందని... తాను మాత్రం స్వల్ప గాయాలతో బయటపడ్డానని వివరించారు. ఆయన చెప్పిన వివరాలపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఘటనాస్థలం పరిశీలిస్తే... ప్రమాదం జరిగిన ఆనవాళ్లు లేవని పేర్కొంటున్నారు. ఘటనను ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని అనుమానిస్తున్నారు. ఆ దిశగానే దర్యాప్తు చేస్తున్న పోలీసులు... అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.
వివాహిత మృతి.. భర్తపై పోలీసుల అనుమానం - అనంతపురం జిల్లా
వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా అరవకురు వద్ద చోటు చేసుకుంది. ప్రమాదంలో తన భార్య చనిపోయిందని భర్త చెబుతుండగా... ప్రమాదంగా చిత్రీకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.
వివాహిత అనుమానాస్పద మృతి
ఇవీ చదవండి..
Last Updated : Feb 22, 2020, 11:33 AM IST