ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కుమార్తె భవిషత్తు కోసం తల్లి ఆమరణ దీక్ష - అనంతపురం జిల్లా వార్తలు

బ్యాంకు రుణం, ప్రభుత్వ ఉపకారవేతనం వస్తుందనే నమ్మకంతో ఉన్నత విద్య కోసం కుమార్తెను విదేశాలకు పంపంది ఓ తల్లి. తీరా బ్యాంకు రుణం మంజూరు కాకపోవడం, ప్రభుత్వం మంజూరు చేసే ఉపకారవేతనం సైతం రాని కారణంగా... విదేశాల్లో కూతురు ఇబ్బందులు పడుతోంది. సమస్యకు పరిష్కారం దొరక్క.. ఆ మాతృమూర్తి తమ ప్రాంతమైన అనంతపురం జిల్లా హిందూపురంలో ఆమరణ దీక్షకు దిగింది.

కుతూరు భవిషత్తు కోసం తల్లి నిరాహార దీక్ష
కుతూరు భవిషత్తు కోసం తల్లి నిరాహార దీక్ష

By

Published : Feb 2, 2021, 10:36 AM IST

Updated : Feb 2, 2021, 11:30 AM IST

అనంతపురం జిల్లా హిందూపురానికి చెందిన చెందిన మక్బుల్జాన్, అయూబ్ ఖాన్ దంపతుల కుమార్తె... రుబియాఖానమ్ ఉన్నత విద్యను అభ్యసించేందుకు ఫిలిపిన్స్ దేశానికి వెళ్లింది. అంతకుముందు ఆమె తల్లిదండ్రులు ఎడ్యుకేషన్ లోన్ కోసం పట్టణంలోని ఓ బ్యాంకును సంప్రదించగా... వారు మంజూరు చేస్తామన్నారు. సరైన పత్రాలు అన్ని సమర్పించాలని కోరారు. బ్యాంకు మంజూరు చేసే రుణంపై ఆశతో, రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసే ఉపకారవేతనం వస్తుందన్న ధైర్యంతో... తమ దగ్గరున్న డబ్బు పెట్టి కుమార్తెను ఎంబీబీఎస్ విద్యను అభ్యసించేందుకు ఫిలిప్పీన్స్ దేశానికి పంపారు.

తీరా అక్కడికి వెళ్ళాక బ్యాంకు వారు...ఇంటికి అప్రూవల్ లేదని రుణాన్ని తిరస్కరించారు. ప్రభుత్వం నుంచి వస్తుందనుకున్న విదేశీ విద్య స్కాలర్షిప్ పథకాన్ని రద్దు చేసిన కారణంగా.. ఇప్పుడు తమ బిడ్డ విద్య ఎలా సాగించగలదని ఆ తల్లి ఆవేదన చెందుతోంది. ప్రజాప్రతినిధులు, అధికారుల చుట్టూ తిరిగిన తమ సమస్య పరిష్కారం కాలేదని.. ఆమరణ నిరాహార దీక్షకు పూనుకొంది. ప్రభుత్వం స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతుంది.

Last Updated : Feb 2, 2021, 11:30 AM IST

ABOUT THE AUTHOR

...view details