కరోనా అనుమానిత లక్షణాలతో అనంతపురం జిల్లా ఉరవకొండ పట్టణానికి చెందిన ఓ మహిళ మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న మహిళ ఉరవకొండ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంది. ఆమెకు మూడు రోజుల క్రితం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. చికిత్స పొందుతున్న ఆమె మంగళవారం మృతి చెందింది. మృతదేహాన్ని మహిళ స్వగ్రామం ఉరవకొండకు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు.
కరోనా అనుమానిత లక్షణాలతో మహిళ మృతి! - అనంతపురం జిల్లా తాజా వార్తలు
అనంతపురం జిల్లా ఉరవకొండలో కరోనా అనుమానిత లక్షణాలతో మహిళ మృతి చెందింది. గత వారం రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆమె .. మంగళవారం మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహిళకు మూడు రోజుల క్రితం కరోనా పరీక్షలు చేశారు. ఆ ఫలితాలు రాగానే... ఉరవకొండలో ఆంక్షలు విధింపుపై అధికారులు నిర్ణయం తీసుకోనున్నారు.
కరోనా అనుమానిత లక్షణాలతో మహిళ మృతి!
కొన్ని రోజుల క్రితం ఆమె అనంతపురంలోని రెడ్ జోన్ ప్రాంతానికి వెళ్లివచ్చినట్లు అధికారులు తెలిపారు. మహిళ కరోనా నిర్ధరణ పరీక్ష ఫలితాలు అనుగుణంగా ఉరవకొండలో ఆంక్షలు విధించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి :వైద్యుల ప్రైవేటు ప్రాక్టీస్ నిషిద్ధం!