అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం నాగిరెడ్డిపల్లిలో ప్రమాదవశాత్తు ఎడ్ల బండి కింద పడి కావేరి అనే ఉపాధి హామీ కూలీ మృతిచెందింది. రోజు మాదిరిగానే కూలీ పనికి సహచరులతో కలిసి ఎడ్ల బండిలో వెళ్తుండగా.. ఎద్దు బెదరటంతో వారు ప్రయాణిస్తున్న బండి అదుపు తప్పి కింద పడింది. మిగతా కూలీలందరూ ముందుగానే దూకేయగా.. కావేరికి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఎడ్లబండి కింద పడి ఉపాధి హామీ కూలీ మృతి - అనంతపురం జిల్లా క్రైం
అనంతపురం జిల్లా నాగిరెడ్డిపల్లిలో విషాదం నెలకొంది. ఎడ్లబండి కింద పడి ఉపాధి హామీ కూలీ మృతి చెందింది. ఈ ఘటనతో మృతురాలి కుటుంబీకులు శోకసంద్రంలో మునిగిపోయారు.
ఎడ్లబండి కింద పడి ఉపాధి హామీ కూలీ మృతి