ఉపసంహరించుకున్నా.. గుర్తుంచుకున్నారు
ఉరవకొండలో నామపత్రాన్ని ఉపసంహరించుకున్న అభ్యర్థినిని అధికారులు తమ నిర్లక్ష్యంతో పోటీలో ఉంచిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఉరవకొండలోని మూడో వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన కట్టుబడి షబానా తన నామపత్రాన్ని ఉప సంహరించుకున్నారు. ఉరవకొండ ఎన్నికల అధికారి గుర్తించకుండా ఆమె బరిలో ఉన్నట్లు గౌను గుర్తును కేటాయించారు.
అనంతపురం జిల్లా ఉరవకొండలో నామపత్రాన్ని ఉపసంహరించుకున్న అభ్యర్థినిని అధికారులు తమ నిర్లక్ష్యంతో పోటీలో ఉంచిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈనెల 12న నామపత్రాల ఉపసంహరణ ముగిసింది. ఉరవకొండలోని మూడో వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన కట్టుబడి షబానా తన నామపత్రాన్ని ఉప సంహరించుకున్నారు. ఉరవకొండ ఎన్నికల అధికారి గుర్తించకుండా ఆమె బరిలో ఉన్నట్లు గౌను గుర్తును కేటాయించారు. నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియ ముగిసి, గుర్తులు కేటాయించగానే అధికారులు బ్యాలెట్ పత్రాల ముద్రణ చేయించారు. శనివారం బ్యాలెట్ పత్రాలు ముద్రణ అయ్యాయి. ఆ తరువాత స్థానికుల సమాచారంతో విషయం తెలుసుకున్న మండల అధికారులు విషయాన్ని జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లగా వారు క్షేత్ర స్థాయిలో విచారించారు. నివేదికను తయారు చేసి కలెక్టరుకు పంపినట్లు సమాచారం. అధికారుల తప్పిదం కారణంగా ఆ వార్డు ఎన్నిక ఆగి పోయే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది.