'మగ్గాల భవన బాధితులకు తగిన సహాయమందిస్తాం' - gonuguntla satyanarayana
మంగళవారం నాడు వీచిన గాలివానకు అనంతపురం జిల్లా ధర్మవరంలో మగ్గాల భవానాల పైకప్పు ఎగిరిపడి వర్షంతో మగ్గాలు తడిచిపోయాయి. ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ ఇందిరమ్మ కాలనీని సందర్శించి బాధితులకు సాయం చేస్తామన్నారు.
'మగ్గాల భవన బాధితులకు తగిన సహాయమందిస్తాం'
అనంతపురం జిల్లా ధర్మవరంలో మగ్గాల భవనాలను ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ సందర్శించారు. మంగళవారం రాత్రి గాలివాన ధాటికి పట్టణ శివార్లలోని ఇందిరమ్మ కాలనీలోని మగ్గాల భవనాలపై కప్పులు ఎగిరిపడ్డాయి. వర్షం నీరు పడి మగ్గాలు తడిసిపోయాయి. జరిగిన నష్టాన్ని ఎమ్మెల్యే అడిగి తెలుసుకుని బాధితులకు తగిన సాయం చేస్తామని తెలిపారు.