ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భర్తను కడతేర్చిన భార్య..! - crime news

మద్యం మత్తులో గొడవపడుతున్న భర్తను నిలువరించే ప్రయత్నంలో.. అతడిని భార్య హతమార్చింది. భర్తను ప్రతిఘటించే క్రమంలో రోకలి బండతో దాడి చేయగా.. అతను మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది.

wife killed husband
భర్తను కడతేర్చిన భార్య

By

Published : May 16, 2021, 9:26 AM IST

అనంతపురం జిల్లాలో మద్యానికి బానిసై నిత్యం ఘర్షణకు దిగుతున్న భర్తను భార్య కడతేర్చింది. తాడిపత్రి పట్టణంలోని క్రిష్ణాపురం 9వ రోడ్డులో శనివారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అబ్దుల్ మజీద్ (35) పెయింటర్​గా జీవనం సాగిస్తుండేవాడు. అతనికి తల్లి హుసేన్ బీ, భార్య మసూద్ బీ, ముగ్గరు పిల్లలు ఉన్నారు.

శనివారం రాత్రి మద్యం మత్తులో ఇంటికి వచ్చిన అబ్దుల్.. తల్లిపై దాడి చేస్తుండగా భార్య అడ్డుకుంది. ఆమెపై రోకలి బండతో దాడి చేశాడు. దాడిని ప్రతిఘటిస్తూ మసూద్ భీ భర్త చేతిలోని రోకలి బండను లాక్కొని తలపై దాడి చేయగా.. అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ABOUT THE AUTHOR

...view details