ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'మొక్కలు నాటడమే కాదు.. వాటి సంరక్షణ బాధ్యతా ప్రభుత్వానిదే' - anantapur district latest news

అనంతపురం జిల్లాలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో రాయదుర్గం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యతను ప్రభుత్వం చేపట్టిందన్నారు.

whip Kapu Ramachandra Reddy
ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి

By

Published : Aug 15, 2021, 6:19 PM IST

వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్య, వైద్య, ఆరోగ్య రంగాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం మండలం ఉడేగేళం గ్రామంలో జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

సర్పంచ్​తో కలసి మొక్కలు నాటిన ప్రభుత్వ విప్.. జగనన్న పచ్చతోరణం కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో లక్షలాది మొక్కలు నాటుతున్నట్లు తెలిపారు. మొక్కలు నాటడమే కాకుండా వాటి సంరక్షణ బాధ్యత ప్రభుత్వం చేపట్టిందన్నారు. నాటిన మొక్కలు ఎండిపోతే సంబంధిత అధికారులే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details