అనంతపురం జిల్లా ధర్మవరంలో అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలతో చేనేత కార్మికుడు ఉరివేసుకుని బలవన్మరణం చెందాడు. రాజేంద్ర నగర్‌కు చెందిన కుల్లాయప్ప చేనేత అనుబంధ వృత్తి అయిన జాకార్డు అట్టలు కొట్టే పనిచేస్తూ జీవించేవాడు. అతను మధుమేహ వ్యాధితో బాధపడుతూ ఉండేవాడు. పనిచేస్తున్న సమయంలో కాలికి గాయం అయ్యింది. దానికితోడు లక్షకు పైగా అప్పులు చేశాడు. వీటన్నింటితో మానసికంగా కుంగిపోయి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అప్పులు, అనారోగ్య సమస్యలతో నేతన్న ఆత్మహత్య
అప్పుల బాధ, అనారోగ్య సమస్యలు తాళలేక నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. ఈ సమస్యలతో మానసికంగా కుంగిపోయిన అతను ఉరివేసుకుని బలవన్మరణం చేసుకున్నాడు.
ఆత్మహత్య చేసుకున్న చేనేత కార్మికుడు