అనంతపురం జిల్లా మడకశిర నగర పంచాయతీ పరిధిలో తాగునీటి సమస్య తీవ్రమైంది. నగర పంచాయతీ పరిధిలోని 20వార్డులు ఉండగా... సుమారు 18వార్డుల్లో తాగునీటి సమస్య నెలకొంది. మున్సిపల్ నీరు 10 రోజులకోసారి కూడా రావడం లేదు. మిగిలిన రోజుల్లో ట్యాంకర్ వచ్చినప్పుడు అందరికీ నీరు అందడం లేదు. దీనివల్ల కాస్త నీళ్లతోనే సర్దుకోవాల్సి వస్తోంది. కుదరదంటే 10 రూపాయలకో నీళ్ల క్యాన్ కొనుక్కోవాల్సి వస్తోందని ప్రజలు వాపోతున్నారు.
తాగునీటికి కటకట.. అల్లాడుతోన్న ప్రజలు
భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో అనంతపురం జిల్లా ప్రజలు తాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. ట్యాంకర్లతో నీరు సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా... అవి ఏ మూలకూ చాలట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
water problems
తాగునీటి ఎద్దడికి నివారణకు చర్యలు చేపడుతున్నామని.... మరో రెండు మూడు రోజుల్లో మడకశిర ప్రజల సమస్య తీరుస్తామని అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా తాగునీటి సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.