'పుట్టపర్తిలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు' - సాంస్కృతిక కార్యక్రమాలు
విజయనగరం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు పర్తియాత్ర పేరుతో పుట్టపర్తి వచ్చారు. జిల్లా సాంప్రదాయ నృత్యాలను చిన్నారులు ప్రదర్శించారు. సత్యసాయి భక్తులు సంయుక్తంగా ఆలపించిన గీతాలను అలరించాయి.
విజయనగరం జిల్లాకు చెందిన సత్యసాయి భక్తులు పుట్టపర్తిలో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ అలరించాయి. సత్యసాయి సేవాసంస్థల ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేస్తున్న విజయనగరం జిల్లా భక్తులు పర్తియాత్ర పేరుతో పుట్టపర్తి వచ్చారు. ప్రశాంతి నిలయంలోని సాయి కుల్వంత్ మందిరంలో ఇవాళ బాలవికాస్ విద్యార్థులు ఇలపై ఈశ్వరుడు అనేక నృత్య నాటికను ప్రదర్శించారు. సత్యసాయి చేపట్టిన సేవా కార్యక్రమాలు, సామాజిక సేవతోనే దైవత్వం పొందవచ్చని, సర్వమత సారాంశాలు ఒక్కటేనని వారు నృత్య, నాటిక రూపంలో ప్రదర్శించి భక్తులను మంత్రముగ్ధులను చేశారు.