అనంతపురం జిల్లాలోని రాయలచెరువు గ్రామంలో ఇళ్ల మధ్య ఉన్న మద్యం షాపులు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ... గుత్తి ఎక్సైజ్ కార్యాలయం వద్ద మహిళలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ గ్రామానికి మద్యం దుకాణం మంజూరు చేసిందని, తమ తలరాతలు మార్చే అలాంటి దుకాణాలు వద్దని ధర్నా చేపట్టారు. తమ కాలనీ పరిసరాల్లో అనేకమంది పొట్ట కూటికోసం రోజువారి పనులకు వెళ్లి సంపాదించిన సొమ్మును పోగుచేసుకుంటున్నారని... ఇలాంటి సమయంలో తమ కాలనీలో మద్యం దుకాణాలు తెరవడంవల్ల తమ భవిష్యత్తు అంధకారంలోకి వెళ్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని...ఎక్సైజ్ అధికారులు వివరించారు.
'మా గ్రామంలో మద్యం దుకాణం వద్దు' - gutti
అనంతపురం జిల్లా గుత్తి ఎక్సైజ్ కార్యాలయం వద్ద మహిళలు నిరసన చేపట్టారు. ప్రభుత్వం తమ గ్రామానికి మద్యం దుకాణం మంజూరు చేసిందని...వెంటనే అనుమతుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మద్యం దుకాణాలు తెరవడం వల్ల తమ భవిష్యత్తు నాశనం అవుతుందన్నారు.
తమ ఊరిలో మద్యం దుకాణం రద్దు చేయాలంటూ నిరసన చేపట్టిన గ్రామస్తులు