సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులకు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో విద్యాబోధన చేయాలని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. అనంతపురంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా... వీసీ ఆచార్య ఎస్.ఏ.కొరి అధ్యక్షతన నిర్వహించిన వెబినార్‌కు ముఖ్య అతిథిగా వెంకయ్య హాజరయ్యారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ హోదాల్లో ఉన్న రాయలసీమ ప్రముఖులు సెంట్రల్ యూనివర్సిటీ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన చెప్పారు. దేశంలోని ఐదు రాష్ట్రాల్లోని ఎనిమిది ఇంజినీరింగ్ కళాశాలల్లో మాతృభాషలో విద్యాబోధన జరుగుతోందని వెంకయ్యనాయుడు అన్నారు. ఏడాది కాలంలో ఐదు కొత్త కోర్సులను ప్రవేశపెట్టామని వీసీ ఆచార్య ఎస్.ఏ.కొరి వెల్లడించారు.
venkaiah naidu : 'ప్రపంచస్థాయి ప్రమాణాలతో విద్యాబోధన చేయాలి' - ఉపరాష్ట్రపతి వార్తలు
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రీయ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవంలో విశిష్ట అతిథిగా వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్రీయ వర్సిటీ ఏర్పాటై మూడేళ్లు పూర్తవుతున్న సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు.
కేంద్రీయ వర్సిటీ వ్యవస్థాపక దినోత్సవం
Last Updated : Aug 26, 2021, 3:52 PM IST