కసాపురం శివాలయంలో వరుణ యాగం - ananthapuram district
అనంతపురం జిల్లా కసాపురం శివాలయంలో వరుణ యాగం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు నీటితో అభిషేకం చేశారు.
ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి అనుబంధ ఆలయమైన శివాలయంలో వరుణ యాగం మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. చివరి రోజైన భాగంగా స్థానిక శివాలయంలో, సహస్ర ఘటాభిషేకం, విఘ్నేశ్వరుని పూజ వంటి కార్యక్రమాలు జరిపారు. వేద పండితులు, ఆలయ అధికారులు పూజాభిషేకాలు ఘనంగా నిర్వహించారు. స్వామివారికి అర్చకులు నీటితో అభిషేకం చేశారు. వేద పండితులు వేదాలు చదివి హోమం జరిపారు. శనివారం అయినందున కసాపురం ఆంజనేయస్వామి దేవాలయానికి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తారు. స్వామివారిని ఉదయాన్నే జిల్లా కలెక్టర్ సత్యనారాయణ దర్శించుకున్నారు. కలెక్టర్కు ఆలయ అధికారులు ఘనంగా స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయ అధికారులు మాట్లాడుతూ రాష్ట్రంలో వర్షాలు లేక ప్రజలు అల్లాడుతున్నారని అందుకోసం మూడు రోజులపాటు ఆలయంలో వరుణ యాగం నిర్వహించామని, ప్రజలు సుఖంగా, సమృద్ధిగా పంటలు పండించాలని ఉద్దేశంతో పూజలు చేశామని అధికారులు తెలిపారు.