అనంతపురం జిల్లా అమిద్యాలలో "ఉట్ల పరుసు ఉత్సవం" ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా... వైభవంగా జరిగింది. వేలాది మంది ప్రజలు ఈకార్యక్రమాన్నీ ఆసక్తిగా తిలకించారు. మొదట గ్రామంలోని పెన్నోబిలేసుని ఆలయం నుంచి శ్రీలక్ష్మీ నరసిహస్వామి వార్ల ఉత్సవ విగ్రహాలను ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఉట్ల మానుకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం ఉట్ల మాను ఎక్కేందుకు కొందరు యువకులు చేస్తున్న ప్రయత్నాన్ని ...ఈలలు, కేకలు వేస్తూ ఉత్సాహపరిచారు. ఔత్సహికులు రెండు సార్లు కిందికి జారిపడిపోగా, మూడోసారి తాడు సాయంతో ఉట్ల మానును ఎక్కి అందులో ఉంచిన, వెన్న ఇతర ప్రసాదాలను అందుకోవడంతో ఉత్సవం ముగిసింది. ఏటా శ్రావణమాసం ఆఖరి వారంలో పెన్నహోబిలం శ్రీలక్ష్మినరసింహ స్వామి దేవాలయం ఆధ్వర్యంలో ఈ ఉత్సవాలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది
ఉత్కంఠ భరితంగా ఉట్ల పరుసు ఉత్సవం - amidyala
అనంతపురం జిల్లా అమిద్యాలలో ఉట్ల పరుసు ఉత్సవం ఉత్కంటగా సాగింది. ఉట్లమాను ఎక్కెందుకు యువకులు చేసిన ప్రయత్నం...ఔరా అనిపించింది. రెండు సార్లు ఎక్కేందుకు ప్రయత్నించి కిందికి జారిపోగా మూడోసారి తాడు సాయంతో ఎక్కి అందులోని వెన్న.. ప్రసాదాన్ని సొంత చేసుకున్నారు.
ఆధ్యంతం ఉత్కంఠ భరితంగా అమిద్యాల ఉట్ల పరుసు ఉత్సవం