గతేడాది నుంచి ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయాలని సీపీఎం డిమాండ్ చేసింది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం తలుపూరులో ఉపాధి హామీ పనులను ఆ పార్టీ జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పరిశీలించారు. కూలీలకు సరైన వసతులు కల్పించాలన్నారు. అధికారులు స్పందించకుంటే ఎంపీడీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు.
'ఉపాధి హామీ కూలీలకు సరైన వసతులు కల్పించాలి' - atmakuru
తలుపూరులో ఉపాధి హామీ పనులను సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ పరిశీలించారు. కూలీలకు సరైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఉపాధిహామీ పనుల పరిశీలన