లోకమాన్య తిలక్ - ఎర్నాకులం రైలులో మరియమ్మ, ఆల్మీద ఎల్సీ అనే ఇద్దరు మహిళలు ముంబయి నుంచి ఎర్నాకులానికి బయల్దేరారు. వీరు బి3, బి4 బోగీల్లో ప్రయాణం చేస్తున్నారు. మార్గమధ్యలో తోటి ప్రయాణికులుగా పరిచయం ఏర్పరుచుకుని టీ తాగమని ఇచ్చారు. తేనీరు పుచ్చుకున్న తర్వాత వారిద్దరూ స్పృహ కోల్పోయారు. మధ్యాహ్నం వరకు మెలకువ రాలేదని బాధితురాళ్లు వాపోయారు. తాము ధరించిన 4 బంగారు గాజులు, 2 చైన్లు ఎత్తుకెళ్లారని చెప్పారు. తోటి ప్రయాణికులు సమాచారం అందించటంతో అధికారులు గుంతకల్లు రైల్వే ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం ఐసీయూకు మార్చారు. పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.
ప్రేమగా టీ ఇచ్చారు... చల్లగా ఆభరణాలు దోచేశారు - guntakal
టీలో మత్తుమందు కలిపి ఇచ్చి ఇద్దరు మహిళల నుంచి బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.
రైలులో చోరీ