నేడు అనంతలో జగన్ "సమరశంఖారావం" - 11 am
ప్రజలకు నవరత్నాల గురించి వివరించి చెప్పడానికే జగన్ మోహన్ రెడ్డి అనంతపురం పర్యటనకు వస్తున్నారని వైకాపా నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి చెప్పారు.
వైకాపా అధినేత జగన్ ఇవాళ అనంతపురంలో నిర్వహంచబోయే సమరశంఖారావం సభలో ప్రజలకు నవరత్నాల గురించి వివరించనున్నారు. ఇందుకోసం నగర శివారులో బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వైకాపా నేత, మాజీ ఎంపీ అనంత వెంకట్రామి రెడ్డి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బూత్ కమిటీల సభ్యులను ఈ సమావేశానికి ఆహ్వానించారు. సంక్షేమ పథకాల అమలులో ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు చెప్పడానికి ఈ సభ నిర్వహిస్తున్నట్లు అనంత వెంకట్రామిరెడ్డి తెలిపారు ఉదయం 11 గంటలకు జగన్ అనంతపురంలో శ్రీ ఫంక్షన్ హాల్ లో తటస్థులతో సమావేశం కానున్నారు. అనంతరం మధ్యాహ్నం ఒంటిగంటకు బహిరంగ సభలో పాల్గొంటారు.
వైకాపా శ్రేణులు ఎన్నికలకు సమాయత్తం అయ్యేలా, తమ అధినేత... పార్టీ విజన్‌ను వివరించనున్నట్లు ఆ పార్టీ సీనియర్ నేత వెంకట్రామి రెడ్డి తెలిపారు. ఎన్నికల నిర్వహణకు కీలకమైన బూత్ లెవల్ కమిటీల ద్వారా నవరత్నాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లనున్నట్లు వివరించారు.