అనంతపురం జిల్లా ముదిగుబ్బ మండలం పైపేడు గ్రామంలో తెల్లవారుజామున పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన గోపాల్, నారాయణస్వామిలకు చెందిన రెండు ఇళ్లు ధ్వంసమయ్యాయి. ఈదురుగాలుల కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో వారు ఆరుబయట నిద్రించారు. ఈ సమయంలో పిడుగుపడటంతో పెద్ద ఎత్తున మంటలు చేలరేగి రెండు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. దాదాపు 10 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు వాపోయారు. పిడుగు ప్రమాదంలో ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
రెండు ఇళ్లపై పిడుగుపాటు...10 లక్షల ఆస్తి నష్టం - two houses smash
అనంతపురం జిల్లా పైపేడు గ్రామంలో తెల్లవారుజామున పిడుగుపాటు సంభవించింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోగా..పది లక్షల ఆస్తినష్టం వాటిల్లింది.
రెండు ఇళ్లపై పిడుగుపాటు