ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మహిళల మనసు మురవంగా.. 'త్రీ డీ' చీర ఇదేగా! - 3d saree

'మా వద్ద అన్ని శుభకార్యాలకు డిజైనర్​ పట్టు చీరలు లభించును' ఇది ప్రతి వస్త్ర దుకాణం ముందు కనిపించే బోర్డు. ఎన్ని చీరలున్నా.. మగువల మనసు ప్రతిసారీ మరో కొత్త వెరైటీ కోసమో.. కొత్త డిజైన్ కోసమో ఆరాటపడుతుంది. అలాంటివాటిలో.. ప్రథమ స్థానంలో ఉంటుంది ధర్మవరం పట్టుచీర. ఆ చీర ప్రత్యేకతే వేరు. ఇప్పుడు.. మరింత కొత్తగా.. మహిళల మనసు మెచ్చేలా ముస్తాబై వచ్చింది 'త్రీడీ ధర్మవరం' పట్టు.

ఇది త్రీడీ చీర గురూ..!

By

Published : Jun 5, 2019, 9:40 AM IST

ఇది త్రీడీ చీర గురూ..!

చీరలోని గొప్పతనం తెలుసుకో... ఆ చీరకట్టి ఆడతనం పెంచుకో... అన్నాడో సినీ కవి. చీరతో సంప్రదాయమే కాదు సాంకేతికతనూ పంచుకో అంటున్నారు ధర్మవరం త్రీడీ చీరల డిజైనర్లు. చీరంటే ఎప్పడూ..ఒకేలా తయారుచేయడం ఎందుకు అనుకున్నారేమో.... అన్నిట్లో ప్రత్యేకంగా ఉండేలా రూపుదిద్దాలనుకున్నారేమో.. ట్రెండ్​కు తగ్గట్టుగా త్రీడీ చీరను తీసుకొచ్చేశారు అనంతపురం జిల్లా ధర్మవరానికి చెందిన నేతన్న నాగరాజు.

త్రీడీ సాంకేతికతో కృష్ణుడి చిత్రాలకు వస్త్రంపై నాగరాజు ప్రాణం పోశాడు. త్రీడీ అద్దాలతో చూస్తే.. ఓ వైపు గోమాత సమేత గోపాలుడు... మరో వైపు గోపికలతో కూడిన గిరిధరుడు మురిపిస్తున్నాడు. ఈ విచిత్రాన్ని చూసి వినియోగదారులూ ఆశ్యర్యపోతున్నారు. 40 రోజుల పాటు కష్టపడి 'శ్రీకృష్ణ మాయ' అనే ఈ చీరను తయారుచేశానని నాగరాజు తెలిపారు.

మహిళల మేనిపై హత్తుకుపోయి.. రంగురంగుల్లో దర్శనమిచ్చే త్రీడి ప్రింట్​ మేజిక్ కోక కట్టుకోక తప్పదిక అన్నంతగా మహిళలను ఆకట్టుకోవడం ఖాయం.

ఇవీ చూడండి-గుడిసెకు ఏసీ.. అభిమానాన్ని చాటుకున్న అల్లుడు

ABOUT THE AUTHOR

...view details