ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దేవుడికే శఠగోపం..హుండీలో సొమ్ము మాయం - పాతవూరు

అందరిని కాపాడే దేవుడికే శఠగోపం పెట్టాడు ఓ ప్రబుద్ధుడు. చెన్నకేశవ ఆలయంలో దొంగతనానికి పాల్పడ్డాడు. సీసీ టీవీ కెమెరాలు ధ్వంసం చేసి మరీ హుండీలోని సొమ్ము ఎత్తుకెళ్లాడు.

దేవుని గుడిలో దొంగతనం.. తెలిసిన వారేనని అనుమానం!

By

Published : Aug 18, 2019, 11:21 AM IST

దేవుని గుడిలో దొంగతనం.. తెలిసిన వారి పనేనని అనుమానం!

అనంతపురం జిల్లా పాతవూరులోని చెన్నకేశవస్వామి దేవాలయంలో దొంగతనం జరిగింది. దొంగలు హుండీలోని డబ్బులు దోచుకెళ్లారు. తెలిసిన వారే పక్కా ప్రణాళికతో చోరీ చేసి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించగా.. ఒక వ్యక్తి ఈ చోరీకి పాల్పడినట్లు తెలిసింది. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ తెలిపారు. ఇటీవల నగరంలో దొంగతనాలు ఎక్కువయ్యాయనీ.. భద్రత కరవైందనీ గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details