ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఆ బడిలో గోడలు పాఠాలు చెబుతాయి! - అనంతపురం జిల్లా తాజా వార్తలు

ఆ పాఠశాలలో అడుగు పెట్టగానే గోడలపై ఉన్న అక్షరాలు, చిత్రాలు స్వాగతం పలుకుతాయి. బడిలోకి వచ్చిన వారెవరైనా సరే కాసేపు వాటిని చూడకుండా ముందుకు కదలరు. కొన్నాళ్ల క్రితం వరకు మాసిపోయిన గోడలతో బోసిపోయిన ఆ పాఠశాల.. శ్రీనివాసులు అనే ఉపాధ్యాయుడి కృషితో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

The walls in that school teaching lessons
The walls in that school teaching lessons

By

Published : Jan 12, 2020, 8:03 AM IST

ఆ బడిలో గోడలు పాఠాలు చెబుతాయి!

అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం ఆమిద్యాల మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో.... గోడలపై చిత్రాలు విద్యార్థుల్లో ఆలోచనలు రగిలిస్తున్నాయి. 315 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఈ పాఠశాలలో... ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న శ్రీనివాసులు స్వతహాగా చిత్రకారుడు. మూడేళ్ల క్రితం బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆయనకు... తరగతి గోడలపై పిచ్చి గీతలు కనిపించాయి. వాటి నుంచి విద్యార్థుల దృష్టి మళ్లించడానికి సొంత ఖర్చుతో ప్రతి గోడపై పాఠ్యాంశాలను పొందుపరుస్తూ చిత్రాలు గీశారు. దాదాపు అన్ని సబ్జెక్టుల నుంచి ప్రధానాంశాలను చిత్రించారు. ఖాళీ సమయాల్లో, సెలవు రోజుల్లో ఈ పనిని పూర్తి చేశారు. అంతేకాకుండా విద్యార్థుల్లో సామాజిక స్పృహ కలిగించే సామెతలు... వివిధ చిత్రాలు ఇక్కడ దర్శనమిస్తాయి.

పాఠశాల ఆకర్షణీయంగా...

ఉపాధ్యాయుడు శ్రీనివాసులు ఎక్కడ పనిచేసినా పాఠశాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతారు. విద్యార్థుల్లో సామాజిక స్పృహ నింపుతూనే, బోధన విషయంలో ప్రత్యేకత చాటుతున్నారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసులు గీసిన చిత్రాలు... విద్యార్థులకు ఎంతో ఉపయోగంగా మారాయని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు తెలిపారు. ఖాళీ సమయాల్లో విద్యార్థులను బయట కూర్చోబెట్టి... వాటి ఆధారంగా సాధన చేయిస్తున్నామన్నారు. చిత్రాలు, గుణింతాలు అక్షరమాలలు ఉండటంతో వాటిని విద్యార్థులు సులభంగా నేర్చుకుంటున్నారని తెలిపారు.

ఇదీ చదవండి:వెలగపూడిలో కలకలం... రైతుల ఇళ్లల్లోకి పోలీసులు!

ABOUT THE AUTHOR

...view details