అన్నక్యాంటీన్లను తెరవాలని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో తెదేపా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నియోజకవర్గ ఇంఛార్జ్ ఉమామహేశ్వర నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసనలో తెదేపా సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చంద్రబాబు పై కోపంతో పేదల ఆకలి తీర్చే అన్నక్యాంటీన్లను మూసివేయడం తగదని నేతలు అన్నారు. క్యాటీన్లను వెంటనే పునరుద్ధరించి, పేదలను ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు.
అనంతలో అన్నక్యాంటీన్లను పునరుద్ధరణకై ధర్నా - ex minister kalva srinivas a
అన్నక్యాంటీన్లను కొనసాగించాలని తెదేపా శ్రేణులు కళ్యాణ దుర్గంలో భారీ ధర్నా నిర్వహించారు. ధర్నాలో పాల్గొన్న మాజీ మంత్రి కాల్వ శ్రీనివాస్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ex minister kalva srinivas arrested by police at rayadurgam
అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో అన్నా క్యాంటీన్ తెరవాలని మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఆధ్వర్యంలో తెదేపా నాయకులు భారీ ర్యాలీ చేసారు. ధర్నా చేస్తున్న తెదేపా నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులుతో పాటు, మాజీ జడ్పీ చైర్మన్ పూల నాగరాజును, కార్యకర్తలను అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు పోలిసులు.
ఇదీచూడండి.రాళ్ల ఉత్సవంలో... దెబ్బలు తగిలినా హాయే!
Last Updated : Aug 16, 2019, 1:46 PM IST