ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వైద్యుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడి సస్పెన్షన్

విధుల్లో ఉన్న వైద్యుడిపై దౌర్జన్యానికి దిగి చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయుడు సస్పెన్షన్​కు గురయ్యాడు. ఈ నెల 2న రోగి బంధువు కొండపల్లి రాంబాబు అనే ఉపాధ్యాయుడు.. మద్యం మత్తులో డాక్టర్​తో వాగ్వాదానికి దిగి చెప్పుతో దాడి చేశాడు.

By

Published : Dec 6, 2020, 9:20 AM IST

Published : Dec 6, 2020, 9:20 AM IST

teacher Suspension in attack on doctor
వైద్యుడిపై దాడి చేసిన ఉపాధ్యాయుడు సస్పెన్షన్

విశాఖ ఏజెన్సీ పాడేరు ప్రభుత్వ ఆస్పత్రిలో ఈ నెల 2న రోగి బంధువు కొండపల్లి రాంబాబు అనే ఉపాధ్యాయుడు.. వైద్యుడితో దురుసుగా ప్రవర్తించాడు. మద్యం మత్తులో డాక్టర్​తో వాగ్వాదానికి చెప్పుతో దాడి చేశాడు. విషయం తెలుసుకున్న వైద్యులు, వైద్య సిబ్బంది ఆసుపత్రి బయట బైఠాయించి, ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలని పట్టుబట్టారు. వైద్యుల విధులకు ఆటంకం కలిగించకుండా రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో వైద్య సేవలు అందించేందుకు మైదాన ప్రాంతాల నుంచి వైద్య నిపుణులు ముందుకు రావడం లేదని... వచ్చినవారు ఇలా దాడులకు గురవటంతో ఆసక్తి చూపడం లేదని అంటున్నారు. దాడికి పాల్పడిన ఉపాధ్యాయుడు రాంబాబును అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. రెండు రోజుల కిందట పాడేరు ఆసుపత్రిలో వైద్యులు, వైద్య సిబ్బంది రక్షణ కోసం పోలీస్ ఔట్ పోస్టులు ఏర్పాటు చేశారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details